అమెరికా : స్వస్తిక్‌కు చట్టబద్దత.. కాలిఫోర్నియా అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

సనాతన హిందూ సంప్రదాయంలో అత్యంత పురాతనమైన, పవిత్రంగా భావించే స్వస్తిక్’గుర్తును నాజీ విద్వేషానికి చిహ్నమైన హకెన్‌క్రూజ్’రెండూ ఒకటే అన్నట్లుగా చూస్తున్నారు కొందరు పాశ్చాత్యులు.అయితే ఆ రెండు ఒకటి కాదని, వేరు వేరని పలు హిందూ సంఘాలు అనేక దేశ ప్రభుత్వాలకు క్లారిటీ ఇచ్చాయి కూడా.

 America's California State Assembly Votes To Legalise The Swastika In Its Penal-TeluguStop.com

అయినప్పటికీ గందరగోళానికి మాత్రం చెక్ పడటం లేదు.ఈ నేపథ్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ సెనేట్ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర శిక్షా స్మృతిలో స్వస్తిక్‌ను చట్టబద్ధం చేయడంతో పాటు నాజీ చిహ్నామైన హకెన్‌క్రూజ్‌‌ ను జర్మనీకి చెందినదిగా గుర్తిస్తూ బిల్లును ఆమోదించింది

కాలిఫోర్నియా రాష్ట్రంలో భారతీయ అమెరికన్లు పెద్ద సంఖ్యలో వున్నారు.వీరు ప్రభుత్వం నుంచి ఈ తరహా చర్యను కొంతకాలంగా కోరుతున్నారు.

గతవారం ఆమోదించిన ఈ బిల్లును గవర్నర్ గావిన్ న్యూసోమ్‌కు పంపనున్నారు.దీనిపై ఆయన సంతకం చేసిన వెంటనే స్వస్తిక్‌ను చట్టబద్ధం చేసిన తొలి అమెరికన్ రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలుస్తుంది.

అంతేకాదు.హిందూమతం, బౌద్ధమతం, జైనమతాలలో స్వస్తిక్‌ను పవిత్ర చిహ్నంగా గుర్తించిన తొలి రాష్ట్రంగా కూడా కాలిఫోర్నియా నిలిచిన సంగతి తెలిసిందే.

గతవారం.మత పెద్దలు, సంస్థల ఇంటర్‌ఫెయిత్ కూటమి.

కాలిఫోర్నియా స్టేట్ సెనేట్ మెజారిటీ లీడర్ బాబ్ హెర్జ్‌బర్గ్‌కు స్వస్తిక్‌ను చట్టబద్ధం చేసే ఏబీ 2282 బిల్లుకు తమ మద్ధతును తెలియజేస్తూ ఒక లేఖను సమర్పించింది.ఇక అసెంబ్లీలో ఈ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదముద్ర లభించడాన్నిహిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) స్వాగతించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube