కాంట్రాక్ట్ గొడవపై మెకానిక్ అసహనం..విమాన వ్యవస్థ ట్యాంపర్, గాల్లో 150 మంది

విమానాన్ని పేల్చేసేందుకు కుట్ర పన్నిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ మెకానిక్‌ను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అబ్దుల్ మజీద్ మరౌఫ్ అహ్మద్ అలానీ అనే మెకానిక్‌‌… గత నెల 17న 150 మంది ప్రయాణికులతో మియామి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బహమాస్ బయల్దేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలోని ఎయిర్ డేటా మాడ్యుల్‌ను నాశనం చేశాడు.

 Americanairlines Mechanic Accused Ofattempted Sabotage Of Flight-TeluguStop.com

ఇది ఎయిర్‌క్రాఫ్ట్‌ స్పీడ్‌, గమనం, ఇతర అత్యవసర డేటాను విశ్లేషిస్తుంది.

Telugu American, Sabotage, Telugu Ups-Telugu NRI

  విమానం టేకాఫ్ అయిన వెంటనే పైలెట్లు ఇంజిన్ వేగాన్ని పెంచారు.అదే సమయంలో ఎయిర్ డేటా మాడ్యూల్‌లో లోపాన్ని గుర్తించి క్షణాల్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు విమానంలో పైలట్ ట్యూబ్ వదలుగా ఉండటాన్ని గుర్తించారు.

ఇది నేరుగా ఎయిర్ డేటా మాడ్యూల్‌కు అనుసంధానించబడి ఉండటాన్ని గమనించారు.దీని నుంచే వెళ్లే ట్యూబులను నల్లటి స్టైరోఫాం మెటిరీయల్‌‌తో ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా చుట్టారని నిర్థారించారు.

నిపుణులు ఇచ్చిన సమాచారంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు సీసీ టీవీ ఫుటేజ్ సాయంతో అలానీని నిందితుడిగా గుర్తించారు.ఇతను విమానం టేకాఫ్ అవ్వడానికి ముందు సెక్యూరిటీ చెక్ చేశాడు.

అహ్మద్ అలానీనిఅదుపులోకి తీసుకున్న పోలీసులు ఫెడరల్ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.అలానీపై విమానాన్ని పేల్చేసేందుకు ఉద్దేశ్యపూర్వక కుట్ర, విధ్వంసం అభియోగాలు నమోదు చేశారు.విచారణలో అలానీ తాను చేసిన నేరం అంగీకరించాడని దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి తెలిపారు.కార్మికులు, విమానయాన సంస్థల మధ్య జరిగిన కాంట్రాక్ట్ వివాదంపై తాను కలత చెందానని అందుకే ఎయిర్ డేటా మాడ్యూల్‌ను ట్యాంపర్ చేశానని ఒప్పుకున్నాడు.

అయితే ప్రయాణికులకు కానీ.విమానానికి కానీ హానీ కలిగించడం తన ఉద్దేశ్యం కాదని అలానీ స్పష్టం చేశాడు.

ఈ కేసుపై విచారణను ఫెడరల్ కోర్టు సెప్టెంబర్‌ 20కి వాయిదా వేసింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube