అమెరికాలో ఓ ఘటనతో రేర్ బర్డ్స్ అనే సంస్థ కి సుమారు 90 కోట్ల పరువునష్టం వరకూ తీసుకువెళ్ళింది.దాంతో ఇప్పుడు సదరు కంపెనీ లోబోదిబో అంటోంది.
అమెరికాలో ప్రఖ్యాత రచయత్రిగా పేరొందిన నటాషా టైన్స్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.అనుకోకుండా ఆమె చేసిన ట్వీట్ పెద్ద దుమారం లేపింది.
ఎన్నో అవార్డుల గ్రహీత జోర్డన్ సంతతికి చెందిన నటాషా అక్కడి మెట్రో రైలులో ప్రయాణం చేస్తున్నారు.

ఈ క్రమంలో, మెట్రో రైలు సంస్థలో పని చేసే కార్మికురాలు నిభంధనలకి విరుద్దంగా ట్రైన్ లో టిఫిన్ చేయడం ఆమె గమనించింది.దాంతో వెంటనే ఆమె తన కెమరాతో ఆమె ఫోటో ని తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.దాంతో నటాషా నల్ల జాతీయురాలు అనే కోణంలో జాత్యహంకారం ప్రకటించారని ఆమెపై ట్వీట్ ల వర్షం కురిసింది.
ఎన్నో విమర్శలు ఆమెపై రావడంతో ఖంగుతిన్న ఆమె వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసేసింది.
ఇదిలాఉంటే నటాషా తన పుస్తక ప్రచురణ, పంపిణీ కోసం ప్రఖ్యాత కంపెనీ అయిన రేర్ బర్డ్ సంస్థ తో చేసుకున్న ఒప్పందాన్ని సదరు కంపెనీ రద్దు చేసుకుంది.
ఈ పరిణామాలతో నటాషా కోర్టు ని ఆశ్రయించారు.అంతేకాదు రేర్ బర్డ్‌పై దాదాపు రూ.90.2 కోట్ల పరువు నష్టం దావావేశారు.







