నిన్న మొన్నటి వరకు భారత్ కెనడా( India , Canada ) వ్యవహారంలో తటస్థంగా వ్యవహరించిన అమెరికా నేడు కనడా అనుకూల వైఖరి తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.జరిగినది తీవ్ర ఆందోళన కలిగించే అంశం అని నిన్న మొన్నటి వరకు వ్యాఖ్యానించిన అమెరికా నేడు భారత్ సహకరించాలంటూ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.
జవాబుదారీతనం ఉండాలని , సహకరించాలని అమెరికా చెబుతున్న నీతులపై అమెరికా బుద్ది తెలిసిన వారు వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు .తమ దేశ ప్రయోజనాలకు భంగం కలిగించినందుకు బిన్ లాడెన్, అల్ ఖాయిదా చీఫ్ ( Bin Laden, Al Qaeda chief )వంటి వారిని ఇతర దేశాల భూభాగంలోకి వెళ్లి వారికి కనీస సమాచారం కూడా లేకుండా అంతమొందించిన అమెరికా ఇప్పుడు ఈ విషయంలో మాత్రం భారత్ కు నీతులు చెప్పాలని చూడడం హాస్యాస్పదంగా ఉందంటూ అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అంతేకాకుండా ఇతర దేశాల అధ్యక్షులు సద్దాం హుస్సేన్ ,గడాఫీ లాంటి దేశాల అధ్యక్షులను తీవ్రవాదం పేరుతో అంతమొందించిన అమెరికా ఏ అకౌంటబిలిటీని ప్రపంచానికి చూపించిందో అందరికీ తెలుసు.మరి జవాబుదారీ తనం ఉండాలని చెబుతున్న అమెరికా ఖలిస్తాన్( Khalistan ) ఏర్పాటుకు అనుకూలంగా భారతకు వ్యతిరేకంగా కెనడా పార్లమెంట్లో రిఫెరెండం చేసినప్పుడు ఇది ఇతర దేశాల సార్వభౌమత్వంలో కలగజేసుకోవడమని కెనడాకు ఎందుకు శుద్ధులు చెప్పలేకపోయిందన్నది పెద్ద ప్రశ్న .

అసలు నిర్జర్ హత్య లో భారత్ పాత్ర ఎంత ఉందో తెలియకుండానే భారతను సహకరించాలని భారత జవాబుదారీ తనo వహించాలని చెబుతున్న అమెరికా చరిత్రలో అనేక నియమాలను ఉల్లంఘించిన సంఘటనలు సాక్షిభూతంగా ఉన్నాయి.కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నామని నాటొ దళాలకు నాయకత్వం వహిస్తున్నామని కెనడా అనుకూల వైఖరి తీసుకుంటే అది అమెరికా భారత సంబంధాలకు అత్యంత ప్రమాదమనే సాంకేతాల్ని బారత కూడా గట్టిగా వినిపించాల్సిన సమయం వచ్చింది .ఉమ్మడి ప్రయోజనాలు అంటూ ఇంత కాలం అమెరికా అనుకూల వైఖరి తీసుకున్న భారత్ కూడా సమయం చూసి వెక్కిరిస్తున్న ఇలాంటి మిత్ర దేశాల వైఖరి పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.తమకు ఎవరు సహజ మిత్రులు ఎవరు అవసరం కోసం స్నేహం చేస్తున్నారు అన్నది గుర్తెరిగి ప్రవర్తంచాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు.







