ఆ నటికి ఘోర అవమానం.. ముసలోడి కంటే నేను చాలా బెటర్ అంటూ పెళ్లి ప్రపోజల్!

జానీ డెప్‌-అంబర్‌ హర్డ్‌ పరువు నష్టం దావా వ్యవహారం ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు.ఇంకా మాజీ భార్య అంబర్‌కు 2 మిలియన్‌ డాలర్ల పరిహారం కూడా చెల్లించాలి.

 Amber Heard Gets Proposal Saudi Man Viral, Amber Heard, Johnny Depp, Saudi Arabi-TeluguStop.com

అంబర్‌ హర్డ్‌,జానీ డెప్‌ లు 2015లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.పెళ్లి అయిన ఏడాదికే ఈ సెలబ్రిటీ జంట కాపురం రచ్చకెక్కింది.

దీంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకుంది ఈ జంట.అదే సమయంలో అంబర్‌ హర్డ్‌.డెప్‌కు అంత పరిహారం చెల్లించే పరిస్థితిలో లేదు అంటూ ఆమె తరపున న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి ఇప్పుడు అంబర్‌ హర్డ్‌కు పెళ్లి ప్రపోజల్‌ పంపాడు.

ఆ పెళ్లి ప్రపోజల్ లో జానీ డెప్ ను ఉద్దేశించి ఆ ముసలోడి కంటే నేనే నయం అంటూ ఓ ఆడియో వాయిస్‌ను అంబర్‌ హర్డ్‌కు పంపాడు ఆ వ్యక్తి.సౌదీ అరేబియాకు చెందిన సదరు వ్యక్తి ఓ షేక్‌గా తెలుస్తోంది.

వాయిస్‌ నోట్‌ ద్వారా అంబర్‌ హర్డ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు సందేశం పంపాడు.అంబర్‌.

నీ దారులన్నీ మూసుకుపోతున్నాయ్‌.నేను తప్ప నిన్ను జాగ్రత్తగా చూసుకునేవాళ్లెవరూ లేరు.

కొందరు నిన్ను ద్వేషిస్తూ.తిడుతున్నారు.

అందుకే.నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నా.ఈ సమాజం నిన్ను అంగీకరించకపోయినా.నిన్ను నేను పెళ్లి చేసుకుంటా.అల్లా దయ నీ మీద ఉంటుంది.నువ్వు గొప్పదానివి.

అయిన జనాలు నిన్ను కావాలనే మెచ్చుకోరు.ఆ ముసలోడి కంటే నేనే నయం.నన్ను పెళ్లి చేస్కో.నాతో సంతోషంగా ఉంటావ్ అని వాయిస్‌ నోట్‌ పంపాడు ఆ వ్యక్తి.Bee4andafter_kw అనే అకౌంట్‌ నుంచి పంపిన ఆ వాయిస్‌ నోట్‌ విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube