తాజాగా అమెజాన్ ఇండియా అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌ను ప్రకటించింది.ఈరోజు భారతదేశంలో ప్రారంభమైన అమెజాన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ అక్టోబర్ 28, 2022 వరకు కొనసాగుతుంది.
ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై ప్రత్యేక డీల్‌లు, భారీ తగ్గింపులను అందిస్తోంది.చాలా కంపెనీల స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై డిస్కౌంట్లను అందించడమే కాకుండా బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది.
ఈ సేల్‌లో ఏయూ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులు గరిష్ఠంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.ఈ సేల్ ఏయే స్మార్ట్‌ఫోన్లు ఎంత తక్కువ ధరలో లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం అమెజాన్‌లో ఐకూ జెడ్6 5జీ రూ.14,999, ఐకూ జెడ్6 లైట్ 5జీ రూ.13,249కి దొరుకుతున్నాయి.ఐకూ నియో 6 5జీ రూ.25,999కే లభిస్తోంది.వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 రూ.23,499.వన్‌ప్లస్ 10R ప్రైమ్ రూ.29,499 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చాయి.రెడ్‌మీ నోట్ 11T 5జీ రూ.14,999కి, రెడ్‌మీ 10ఏ రూ.6,996కి, రెడ్‌మీ నోట్ 11 ప్రో + 5జీ రూ.18,499కి అమెజాన్ సేల్ చేస్తోంది.రెడ్‌మీ 9 యాక్టివ్ రూ.7,299, రెడ్‌మీ ఎ1 రూ.5,489, రెడ్‌మీ కె50ఐ రూ.19,999కి అమెజాన్ సేల్‌లో దొరుకుతున్నాయి.

ఈ సేల్ సమయంలో రియల్‌మీ నార్జో 50 4జీ రూ.9,999కి అందుబాటులో ఉండగా, రియల్‌మీ నార్జో 50ఐ రూ.5,749కి అందుబాటులో ఉంది.అమెజాన్ ఇండియా శామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 5జీ ఫోన్‌ను కేవలం రూ.12,999కే అందిస్తోంది.అలానే సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ.1,000 క్యాష్‌బ్యాక్‌ని అందిస్తుంది.ఇది మూడు, ఆరు నెలల నో కాస్ట్ ఈఎంఐ ఎంపికను కూడా కలిగి ఉంటుంది.కొత్త ఫోన్ కొనుగోలు చేసేవారు ఈ డీల్స్ ఒకసారి చెక్ చేయవచ్చు.