ఇటీవల కాలంలో ప్రైమ్ వీడియో( Prime Video ) తన జోష్ నీ పెంచేసింది.అభిమానులను ఆకర్షించడం కోసం ఎంటర్టైన్ చేయడం కోసం నెట్‌ఫ్లిక్స్‌ను( Netflix ) తలదన్నేలా నెటిజన్లు, అభిమానులు తమ కనురెప్పలు కొట్టేంత సమయం కూడా ఇవ్వకుండా తమ అప్‌కమింగ్ సినిమాలు, వెబ్ సిరిస్‌లను ప్రకటిస్తూ అప్‌డేట్లతో ముంచెత్తింది.
అయితే గతంలో నెట్‌ఫ్లిక్స్ ప్రారంభించిన ఈ తరహా సాంప్రదాయాన్ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో అందిపుచ్చుకుని నెట్‌ఫ్లిక్స్‌ను మించి మా స్టామినా ఇది అనే రేంజ్‌లో భారీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు వెళ్లడించి అవతలి సంస్థలు కంగుతినేలా చేసింది.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లలో మాదే రాజ్యం అని ఇక చూసుకుదాం.ఆట ఇప్పుడే మొదలైంది.అన్నట్లుగా తమ కంటెంట్‌ను, వారితో పరిచయాలను సోషల్ మీడియాలో ప్రతి నిమిషం ప్రకటిస్తూ వచ్చింది.
కాగా ముఖ్యంగా ప్రైమ్ వీడియో ఈ రోజు ప్రకటించిన వాటిల్లో పవన్‌కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు,( Hari Hara Veeramallu ) ఉస్తాద్ భగత్ సింగ్ ,( Ustaad Bhagat Singh ) రామ్ చరణ్ గేమ్ చేంజర్,( Game Changer ) నితిన్ సూర్య కంగువ , విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనుష్క శెట్టి గాటి శ్రీవిష్ణు ఓమ్ భీం భుష్,సుహాస్, కీర్తి సురేష్ ఉప్పుకప్పురంబు వంటి సినిమాలతో పాటు ఇంకా చాలా సినిమాలు విడుదల కానున్నాయి.

అలాగే మిర్జాపూర్ 3 ,( Mirzapur 3 ) వరుణ్ దావణ్, సమంతల సిటాడెల్,( Citadel ) ఫ్యామిలీమెన్ 3, నాగ చైతన్య ధూత, ఐశ్వర్య రాజేశ్ సుజల్, పాతాల్ లోక్ సీజన్ 2,సంచాయత్ సీజన్ 3, బందీస్ బండిట్స్, సివరాపల్లి వంటి అమెజాన్ ఒరిజినల్ వెబ్ సిరీస్‌లను కొన్ని బాలీవుడ్ సినిమాలను త్వరలో స్ట్రీమిగ్‌కు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఇప్పుడు ప్రైమ్ వీడియో తమ కంటెంట్‌ను ప్రకటించి ఇండైరెక్ట్‌గా ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి మేము సిద్ధం.మీరు సిద్ధమా అంటూ అవతలి ఫ్లాట్ ఫాంలకు సవాల్ విసరడంతో నెట్‌ఫ్లిక్స్ కూడా త్వరలో తమ కంటెంట్‌ను ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.