ఉప్మాతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా.. వెయిట్ లాస్ కూడా!

ఉప్మా( Upma ).పరిచయం అవసరం లేని పేరు.

ఉదయం లేవగానే టిఫిన్ ఏం చేయాలో అని హైరానా పడుతున్న మమ్మీస్ కు ఈజీగా అయిపోయే రెసిపీ ఉప్మా.

ముఖ్యంగా మన భారతీయులకు ఉప్మాతో విడదీయలేని సంబంధం ఉంది అన‌డంలో సందేహం లేదు.

అయితే ఇప్పుడు ఈ ఉప్మా గోలేంటి అని అనుకుంటున్నారా.విషయం ఉందండోయ్.

ఏదో కడుపు నింపుకోవడానికి ఉప్మా తినేశాము అనుకోకండి.ఉప్మా వ‌ల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ముఖ్యంగా కూరగాయలు వేసి గోధుమ రవ్వతో చేసిన ఉప్మాను బ్రేక్ పాస్ట్ లో తీసుకుంటే బోలెడు ఆరోగ్య లాభాలు పొందొచ్చని అంటున్నారు.గోధుమ రవ్వ ఉప్మాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.అలాగే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

అందువల్ల మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఉప్మాను తీసుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.చిరు తిండ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.

మెటబాలిజం రేటు పెరుగుతుంది.దాంతో వెయిట్ లాస్ అవుతారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

అలాగే గోధుమ రవ్వతో చేసే ఉప్మాలో ఐరన్ కూడా ఉంటుంది.అందువల్ల ఉప్మాను త‌ర‌చూ తీసుకుంటే రక్తహీనత( Anemia ) బారిన పడకుండా ఉంటార‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఉప్మా డైట్ లో ఉండడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.

Advertisement

బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.దాంతో గుండె పోటు( Heart attack ) తో సహా వివిధ రకాల గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

అంతేకాదు గోధుమ రవ్వతో తయారు చేసే ఉప్మాను తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి.కిడ్నీ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.మరియు ఉప్మా లో ప్రోటీన్ కూడా ఉంటుంది.

ఇది మిమ్మల్ని రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్ గా ఉంచ‌డానికి సహాయపడుతుంది.కాబట్టి ఉప్మానేగా అని అస్సలు తీసి పారేయకండి.

ఉప్మా తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇక‌పై ఇంట్లో ఉప్మా చేసినప్పుడు అస్సలు పేచీలు పెట్టకుండా ఓ పట్టు పట్టేయండి.

తాజా వార్తలు