ఈషా అంబానీ పెళ్లి కవర్‌ చేసిన ఫొటో గ్రాఫర్‌ షాక్‌ అయ్యాడట.. అంబానీ ఫ్యామిలీ ఆయనతో ఎంతకు డీల్‌ కుదుర్చుకున్నారంటే..!

ఇండియాలోనే అతి ధనవంతుడైన ముఖేష్‌ అంబానీ తన కూతురు ఈషా పెళ్లిని ఇటీవలే వైభవంగా నిర్వహించిన విషయం తెల్సిందే.ఈ పెళ్లిలో అతిరథ మహారథులు ఎంతో మంది హాజరు అయ్యారు.

 Amazing Experience The Photographer Gets In Esha Ambani Marriage-TeluguStop.com

బాలీవుడ్‌ సెలబ్రెటీలతో పాటు, అంతర్జాతీయ స్థాయి స్టార్స్‌ మరియు ప్రముఖులు హాజరు అయిన ఈ పెళ్లి దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా పేరు గాంచింది.రాజస్థాన్‌ కోటలో జరిగిన ఈ వివాహ వేడుక అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలుగా వచ్చింది.

వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసి మరీ ఈ వివాహ వేడుకను అంబానీ కుటుంబ సభ్యులు నిర్వహించారట.అంతకు మించే అయ్యి ఉండవచ్చు అనేది కొందరి వాదన.

ఇంతటి ఖర్చుతో నిర్వహించిన ఈ వివాహ వేడుక ఫొటో కవరేజ్‌ వివేక్‌ సెక్కిరాకు చేశాడు.మగళూరుకు చెందిన ఈ 47 ఏళ్ల ఫొటోగ్రాఫర్‌ సెలబ్రెటీల వేడుకలకు ఫొటోలు తీస్తూ ఉంటాడు.అంబానీ ఇంట పెళ్లికి ఫొటో కవరేజ్‌కు ఈయనకు ఛాన్స్‌ రావడంతో అంతా కూడా ఈయన గురించి చర్చించుకుంటున్నారు.దేశ వ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశం అయిన ముఖేష్‌ అంబానీ కూతురు పెళ్లి వేడుకకు ఫొటోలు తీసే అవకాశం రావడం అన అదృష్టంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

గత జూన్‌ నెలలో నాకు డిసెంబర్‌ 1 నుండి 15వ తారీకు వరకు డేట్లు బ్లాక్‌ చేసి పెట్టాల్సిందిగా ఒక వ్యక్తి ఫోన్‌ చేశాడు.ఆ తేదీలో ప్రముఖుల ఇంట్లో పెళ్లి ఉందని చెప్పుకొచ్చాడు.ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు అని నేడు అడుగగా అది కొన్నాళ్ల తర్వాత తెలుస్తుందని చెప్పుకొచ్చాడు.అక్టోబర్‌ లో నాకు విషయం తెలిసింది.ముఖేష్‌ అంబానీ కూతురు ఇంట పెళ్లి అనగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.

రెండు రోజులు నిద్ర కూడా పట్టలేదు.ఆ కార్యక్రమంను ఊహించుకుంటూనే ఉన్నాను.ఆ సందర్బంగా రానే వచ్చింది.

ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను.మొత్తంగా 17 మందిని ఈ కార్యక్రమం కోసం వినియోగించుకున్నాను.

హై ఎండ్‌ హెచ్‌ డీ కెమెరాలను వాడాం.ప్రతి ఒక్కరు కూడా ది బెస్ట్‌ ఫొటోగ్రాఫర్స్‌.

వారందరితో వారం రోజుల ముందు నుండే చర్చలు జరిపి కార్యక్రమం ఎలా కవర్‌ చేయాలనేదానిపై ప్లాన్‌ చేసుకున్నాం అన్నాడు.

మొత్తంగా 1.2 లక్షల ఫొటోలను పెళ్లి సందర్బంగా మేము తీశాం.వాటి సైజ్‌ దాదాపుగా 30 టిబి ఉంటుంది.

వాటిని అత్యంత భద్రమైన స్థానంలో పెట్టాము.వాటిని అతి త్వరలోనే గ్రేడ్‌ చేసి ఆల్బమ్‌ ను రెడీ చేస్తాం.

అది అత్యంత పెద్ద కష్టమైనది.అయినా కూడా త్వరగా పూర్తి చేస్తానంటూ వివేక్‌ పేర్కొన్నాడు.

ఇక ఈ కార్యక్రమంను ఆయనకు దాదాపు 10 కోట్లకు కాంట్రాక్ట్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఆయన 20 ఏళ్ల కెరీర్‌లో ఇదే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube