బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అమర్ దీప్ చౌదరి( Amardeep Chowdary ) ఒకరు.ఈయన బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొని రన్నర్ గా బయటకు వచ్చారు.ఇక హౌస్ లో ఉన్నప్పుడు ప్రశాంత్( Prashanth ) అమర్ మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడిన సంగతి తెలిసిందే.
అమర్ ప్రశాంత్ ను టార్గెట్ చేసి మాట్లాడటంతో గ్రాండ్ ఫినాలే రోజు ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ పై ఉన్నటువంటి కోపం మొత్తం తీర్చుకున్నారు.ఏకంగా ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి చేసిన సంగతి మనకు తెలిసిందే.
అయితే పలుమార్లు ఈ ఘటన గురించి అమర్ స్పందించారు.తాజాగా శోభా శెట్టి( Sobha Shetty ) కాఫీ విత్ శోభ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా అమర్ తన భార్య తేజస్విని( Tejaswini ) తో కూడా హాజరయ్యారు.

తాజాగా మరోసారి కూడా అమర్ కారు ఘటన గురించి మాట్లాడారు.బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు నేను అమ్మ తేజ్ ఓకే కారులో వస్తున్నాము అయితే ఒక్కసారిగా మాపై రాళ్ల దాడి జరిగిందని తెలిపారు.వాళ్ళందరూ అలా దాడి చేయడానికి కారణం నేను కానీ ఈ రాళ్ల ఘటనలో అమ్మ తేజు ఎక్కడ గాయపడతారోనని బాధపడ్డాను అందుకే ఆ క్షణం నేను కారు దిగి బయటకు రావాలి అనుకుంటే అమ్మ ఆపింది.

పొరపాటున ఆరోజు అమ్మకి కనక ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే మాత్రం నేను బయటకు వచ్చి ఎవర్నో ఒకరిని చంపేసే వాడినంటూ తాజాగా అమలు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.నా స్థానంలో మీరే కనుక ఉంటే ఈ ఘటనను మీరు ఒప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు.ఇలా తన కారు పై దాడి జరగడంతో కారు రిపేరు చేయించడానికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయిందంటూ అమర్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.