అమరావతి నిర్మాణంలో ఎన్ని దేశాలు?

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రధాన పాత్రధారి సింగపూర్ అని, జపాన్ కూడా భాగస్వామి అయ్యిందని ఇప్పటివరకు తెలిసిన సమాచారం.కానీ ఇంకా కొన్ని దేశాలు కూడా పాలు పాలుపంచుకుంటాయని తెలుస్త్తోంది.

 Capital Development Is The Focus For Ap Govt-TeluguStop.com

ఏపీ ప్రభుత్వం ఇజ్రాయిల్తో, మరికొన్ని దేశాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.శంకుస్థాపన ముగిసింది కాబట్టి నిర్మాణ పనులు మొదలు పెట్టి వేగంగా ముందుకు తీసుకు వెళ్లాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ఇందులో భాగంగా మరికొన్ని దేశాలతో నిర్మాణ పనులపై చర్చలు జరుపుతోందట.అమరావతి నిర్మాణం మెగా ప్రాజెక్టు.

లక్షల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టు.ఇందులో నిర్మాణాలు చేజిక్కించుకుంటే లాభాల పంట పండుతుంది.

అందుకే పలు దేశాలు ఎగబడుతున్నాయి.అమరావతి నిర్మాణంలో భాగాస్వాములయ్యే దేశాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే అవకాశం ఏపీ ప్రభుత్వం కల్పిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇందులో ఎంతో కొంత నిజం ఉందనిపిస్తోంది.లాభం లేకుండా అమరావతిలో నిర్మాణాలు చేయడానికి విదేశీ కంపెనీలు ముందుకు రావు.

అందులోనూ అవి దీర్ఘకాలిక ప్రయోజనాలు కోరుకుంటున్నాయి.ఉమ్మడి రాష్ట్రంలో బాబు అధికారంలో ఉండగా ఇజ్రాయిల్ ఆయనకు ఇష్టమైన దేశం.

అక్కడి వ్యవసాయ విధానం రాష్ట్రంలో అమలు చేయాలని ప్రయత్నించారు.కానీ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఇజ్రాయిల్ ప్రయోగం ఫలించలేదు.మళ్ళీ ఇప్పుడు అమరావతిలోకి ఇజ్రాయిల్ను దింపుతున్నారు కాబోలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube