తోటకూరలలో రకాలు.. సాగు చేసే విధానంలో మెళుకువలు..!

ఆకుకూరలలో విటమిన్లు, ప్రోటీన్లు, లవణాలు పుష్కలంగా ఉండడం వల్ల ఆకుకూరలను పోషకాహారంగా తీసుకుంటారు.ఆకుకూరలలో ప్రధానమైన కూరగా తోటకూరను( Amaranth ) చెప్పుకోవచ్చు.

 Amaranth Types Farming Techniques In Amaranth Cultivation Details, Amaranth , Am-TeluguStop.com

తోటకూరను సాగు చేసి ఏడాది పొడవునా మంచి ఆదాయాన్ని పొందవచ్చు.కాకపోతే సాగు విధానంలో కొన్ని మెళుకువలు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.

తోటకూరను ఎలాంటి వాతావరణ పరిస్థితులలోనైనా సాగు చేయవచ్చు.కానీ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే మొక్కలలో పెరుగుదల సరిగా ఉండదు.

తోటకూర సాగుకు నేల యొక్క పీహెచ్ విలువ( pH Value ) 6 నుండి 7 వరకు ఉండే నేలలు చాలా అనుకూలం.నీరు నిలిచే బంకమట్టి నేలలు, ఇసుక నేలలు తప్ప మిగిలిన నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలం.

నేలను లోతు దుక్కులు దున్నుకొని ఆఖరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు( Cattle Manure ) వేసి కలయదున్ని నేలను చదును చేసుకోవాలి.వర్షాధారంగా అయితే జూన్ నుండి అక్టోబర్ నెలలో సాగు చేయవచ్చు.

వేసవిలో అయితే మే నెలలో సాగు చేయాలి.ఒక ఎకరాకు కిలో విత్తనాలు అవసరం.

పొలంలో 20*20 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి.తోటకూరలలో ఉండే రకాలు ఏమిటో చూద్దాం.

Telugu Amaranth, Amaranth Types, Cattle Manure, Soil Fertility-Latest News - Tel

ఆర్.ఎన్.ఎ.1:

ఈ రకానికి చెందిన తోటకూర ఆకులు కాండం లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి.విత్తిన 20 రోజులకే మొదటి కోత చేతికి వస్తుంది.కోత తరువాత శాఖలు విస్తరిస్తాయి.ఈ రకం నీటి ఎద్దడిని తట్టుకోవడంతో పాటు తెల్ల ఆకుమచ్చ తెగులు కూడా తట్టుకోగలుగుతుంది.ఖరీఫ్ లేదా వేసవికాలంలో సాగు చేయవచ్చు.

కో 1:

ఈ రకానికి చెందిన తోటకూర ఆకులు, కాండం( Stem ) లావుగా ఉండి కండ కలిగి ఉంటాయి.విత్తిన 25 రోజులకు పంట చేతికి వస్తుంది.

ఆకులు వెడల్పుగా ఉండి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

Telugu Amaranth, Amaranth Types, Cattle Manure, Soil Fertility-Latest News - Tel

కో 2:

ఈ రకానికి చెందిన తోటకూర ఆకులు కొలగ, ముదురు ఆకుపచ్చ రంగులో పొడవుగా ఉంటాయి.కాండం లేతగా మృదువుగా ఉంటుంది.విత్తిన 30 రోజులకు కోతకు వస్తుంది.

సిరి కూర:

ఈ రకానికి చెందిన మొక్కలు పొట్టిగా ఉండి ఆకులు చిన్నవిగా ఉంటాయి.కాండం, వేరు కలిసే చోటు గులాబీ రంగులో ఉంటుంది.

విత్తిన 25 రోజులకు కోతకు వస్తుంది.

తోటకూర సాగు చేస్తే.

ఒక ఎకరానికి 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఉంటే ఎరువులు వేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube