Amala Paul : బేబీబంప్ తో భర్తతో కలసి పబ్ లో డాన్స్ చేసిన అమలా పాల్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో నటి అమలాపాల్( Amala Paul )  ఒకరు.ఈమె అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలు అలాగే నాయక్, పిట్టకథలు వంటి పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

 Amalapaul Dance With Baby Bump Photos Goes Viral-TeluguStop.com

అయితే ఇటీవల కాలంలో ఈమె తెలుగు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈమె తమిళ మలయాళ సినిమాలలో నటిస్తూ ఉన్నారు.

ఇకపోతే అమలాపాల్ గతంలో తమిళ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుని అనంతరం తనతో వచ్చినటువంటి విభేదాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే.ఇలా విడాకులు తీసుకొని విడిపోయినటువంటి ఈమె రహస్యంగా జగత్ దేశాయ్( Jagath Desai ) అనే వ్యక్తితో ప్రేమ ప్రయాణం చేస్తూ వచ్చారు.

అయితే ఉన్నఫలంగా ఈమె తన బాయ్ ఫ్రెండును అందరికీ పరిచయం చేయడమే కాకుండా ఆ వెంటనే పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా గతేడాది నవంబర్లో పెళ్లి చేసుకున్నటువంటి అమలా పాల్ పెళ్లయిన రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్( Amala Paul Pregnant ) అనే గుడ్ న్యూస్ అందరితోను పంచుకున్నారు.అయితే ఇటీవల కాలంలో ఈమె తన బేబీ బంప్( Amala Paul Baby Bump ) ఫోటోలతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.తన బేబీ బంప్ తోనే సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొనే హంగామా చేస్తున్నారు.

అయితే తాజాగా ఈమె తన భర్తతో కలిసి ఓ పబ్ లో డాన్సులు చేస్తూ కనిపించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో పలువురు ఈమెపై ఫైర్ అవుతున్నారు ఏడు నెలల గర్భంతో ఇలా పబ్ లో డాన్స్ చేస్తూ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటూ విమర్శలు చేయగా మరికొందరు వీరిద్దరిని ప్రోత్సహిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube