మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్యాంక్ బండ్ పై అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.
అల్లూరి సీతారామరాజును గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుడు విధి అని తెలిపారు.వీరుడు దేశంలో ఎక్కడ పుట్టిన వీరుడే అని చెప్పుకొచ్చారు.
అల్లూరి జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.
అల్లూరి 125వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
ట్యాంక్ బండ్ పై జరిగిన అల్లూరి జయంతి కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమవరంలో 125వ అల్లూరి జయంతి సందర్భంగా.మన్యం వీరుడు పుట్టిన గడ్డ గనుక.
దాదాపు ముప్పై అడుగుల ఎత్తు గల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీతో పాటు ఏపీ సీఎం జగన్, ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ మరియు జగన్ ఇంకా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలువురు ఏపీ మంత్రులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.







