స్టార్ హీరోయిన్ కు షాక్ ఇవ్వబోతున్న టాలీవుడ్.. వాటికి సంబంధం లేదని అగ్రిమెంట్!?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు కొన్ని కొన్ని సార్లు సినీ ఇండస్ట్రీ నుండే వ్యతిరేకత ఎదురవుతుంది.నిజానికి వారు చేసే పొరపాటు వల్లే వారికి ఇండస్ట్రీలో చెడు పేరు మోయాల్సి వస్తుంది.

 Tollywood Is Going To Give A Shock To The Star Heroine By Giving Agreement, Toll-TeluguStop.com

ఇప్పటికే చాలామంది నటీనటులు తమ చేసుకున్న పొరపాటు వల్ల సినీ ఇండస్ట్రీలో చెడు పేరు తెచ్చుకున్నారు.అలా ఇటీవల ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో బాగా నెగిటివిటీ సొంతం చేసుకుంది.

ఇంతకు ఆమె ఎవరో కాదు.పూజా హెగ్డే.

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా నిలిచిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి అందరికీ పరిచయమే.ప్రస్తుతం ఈ అమ్మడి క్రేజ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.

తొలిసారిగా 2010లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.కెరీర్ మొదట్లో వరుస ఫ్లాప్ లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.ఇక తన అందంతో ఎంతోమంది కుర్రాళ్లను ఆకట్టుకొని వారిని అభిమానులుగా మార్చుకుంది.

ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమా కచ్చితంగా మంచి సక్సెస్ అందుకోవడం ఖాయం.

అందుకే దర్శక నిర్మాతలు కూడా పూజా హెగ్డే ను ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు.అలా వైకుంఠపురంలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బుట్ట బొమ్మ.

ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.ఇక ఇటీవలే పాన్ ఇండియా మూవీలో అవకాశాలు అందుకోగా వరుసగా ప్లాప్ అందుకొని నిరాశ చెందింది.

అది కూడా స్టార్ హీరోల సరసన నటించిన సినిమాలోనే ఫ్లాపులు ఎదుర్కొంది.ఇక మళ్లీ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది.ఓ వైపు బాలీవుడ్ లో మాత్రం అవకాశాలు బాగా అందుకుంటుంది.కానీ ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఒక నెగెటివిటీని మూట కట్టుకుంది.

భారీ పారితోషకం తో పాటు వ్యక్తిగత ఖర్చులు కూడా నిర్మాతలకు చుక్కలు చూపించింది.

Telugu Actress, Mukunda, Telugu, Tollywood-Movie

ఈ విషయం ఇండస్ట్రీలో బాగా హార్ట్ టాపిక్ గా మారగా.చివరికి ఆ నిర్మాతలు తన వ్యక్తిగత బిల్లులను తనని కట్టుకోమని వెనక్కి పంపించేశారు.ఇక ఆ బ్యూటీకి ఏ ఇండస్ట్రీలో అయితే ఈ నెగెటివిటీ మూటగట్టుకుందో అక్కడ అవకాశాలు కూడా ఇవ్వడానికి భయపడుతున్నారు దర్శక నిర్మాతలు.

దీంతో టాలీవుడ్ లోనే మళ్లీ బిజీగా మారింది.ఇక ఈ అమ్మడు ఇంత డిమాండ్ చేయటంతో డిమాండ్ తగ్గించే బాధ్యత టాలీవుడ్ పైన ఉంది అని తెలుస్తుంది.

ఇక టాలీవుడ్ నిర్మాతలు కూడా తనను వెనక్కి లాగడానికి ఇదే సరైన సమయం అని.ముందుగానే పారితోషక విషయంలో కాకుండా వ్యక్తిగత ఖర్చులతో తమకు ఎటువంటి సంబంధం లేదని అగ్రిమెంట్ రాసుకోవాలని కొత్త చర్యలు కూడా చేపట్టనున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి ఈ అమ్మడి డిమాండ్ ను టాలీవుడ్ గట్టి షాకిచ్చేలా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube