అల్లు శిరీష్ ( Allu Sirish ) గురించి ఏ చిన్న వార్త వినిపించిన క్షణాల్లో నెట్టింట్లో అది వైరల్ అవుతుంది.దానికి ప్రధాన కారణం అల్లు అరవింద్ తన రెండో కొడుకు అల్లు అర్జున్ ( Allu Arjun ) మీద పెట్టినంత శ్రద్ధ మూడో కొడుకు అల్లు శిరీష్ మీద పెట్టడు అంటూ ప్రతిసారి కొన్ని రూమర్స్ సోషల్ మీడియా లో వినిపిస్తూ ఉంటాయి.
అంతేకాదు అల్లు శిరీష్ ఇంట్లో గొడవపడి ఆస్తిపాస్తులు తనవి తనకి పంచేయమని,ఇంటి నుండి వెళ్లిపోతానని చెప్పారని ఇలా ఎన్నో రూమర్స్ తెరమీద వినిపించాయి.అయితే ఈ మధ్యకాలంలో అల్లు శిరీష్ పెళ్లి చేసుకోకపోవడానికి ఆయనకు ఓ భయంకరమైన జబ్బు ఉందని, ఆ కారణంతోనే పెళ్లికి దూరంగా ఉన్నారని కూడా వార్తలు వినిపించాయి.
అయితే అసలు నిజం ఇది కాదట.అల్లు శిరీష్ ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించారట.
కానీ ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెబితే అల్లు అరవింద్ ( Allu Aravind ) ఆ పెళ్లికి ఒప్పుకోలేదట.

దాంతో ప్రతిసారి ఇంట్లో గొడవలు పెట్టుకుంటూ తరచూ ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉంటారట.కానీ ఈ విషయం తెలియని కొంతమంది అల్లు శిరీష్(Allu Sirish) కి అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు వచ్చి ఇంటి నుండి వెళ్ళిపోతున్నాడు అని ప్రచారం చేస్తారు.అయితే ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్లే ఇన్ని రోజులుగా పెళ్లికి దూరంగా ఉంటున్నారట అల్లు శిరీష్.
అంతే కాదు ఆ అమ్మాయితో పెళ్లికి ఓకే చెప్పకపోతే జీవితాంతం అలా సింగిల్ గానే ఉంటాను అని,పెళ్లి చేసుకోకుండానే బ్రహ్మచారిగా మిగిలిపోతాను అంటూ పేరెంట్స్ కి వార్నింగ్ కూడా ఇస్తున్నారట.అయితే ఈ విషయంలో అల్లు అరవింద్ కన్విన్స్ అయ్యి అల్లు శిరీష్ ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.








