దగ్గుబాటి రానా ( Daggubati Rana ) ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది.ఎందుకంటే ఈయన సినిమాల్లోకి హీరోగా పరిచయం కాకముందే విజువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా దాదాపు 70 సినిమాలకు పని చేశారు.
ఇక మొదటిసారి లీడర్ సినిమా ( Leader movie ) తో టాలీవుడ్ పరిశ్రమలోకి అరంగేట్రం చేశారు.ఇక మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రానా దగ్గుబాటికి మంచి గుర్తింపు వచ్చింది.అలా కొన్ని సినిమాలు చేస్తున్న సమయంలో మొదటిసారి బాహుబలి సినిమాలో ప్రభాస్ కి విలన్ గా నటించి సంచలనం సృష్టించారు.అలాగే భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి విలన్ గా చేశారు.
ఇలా ఈయన కేవలం హీరో గానే కాకుండా నిర్మాతగా..విలన్ గా.కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి చేసిన రానా నాయుడు ( Rana Naidu ) వెబ్ సిరీస్ లో నటించిన అప్పటికి కొంతమంది దీన్ని ఆదరించినప్పటికీ మరి కొంత మంది మాత్రం విమర్శించారు.మరి ముఖ్యంగా ఇందులో రానా కంటే ఎక్కువగా వెంకటేష్ విమర్శల పాలయ్యారు.
ఎందుకంటే అప్పటివరకు ఫ్యామిలీ హీరోగా ఉన్న వెంకటేష్ ఒక్కసారిగా ఆ వెబ్ సిరీస్ లో నటించేసరికి ఆయనను చాలా మంది విమర్శించారు.
ఇక ఇది పక్కన పెడితే దగ్గుబాటి రానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నా జీవితంలో పెద్ద విలన్ అల్లు అరవింద్ ( Allu Aravind ) అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.మరి అల్లు అరవింద్ కి రానాకి మరీ అంత శత్రుత్వం ఎక్కడినుండి వచ్చింది అంటే.మనందరికీ తెలుసు రామ్ చరణ్ రానా ఇద్దరు చిన్నప్పటినుండి బెస్ట్ ఫ్రెండ్స్ అని.ఇక వీరిద్దరూ చిన్నప్పుడు ఎన్నో చిలిపి పనులు చేసి పేరెంట్స్ తో తన్నులు తిన్న సంగతి కూడా ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో వీళ్ళు బయటపెట్టారు.
అయితే ఏదైనా తప్పు పని చేసి రామ్ చరణ్ ( Ram charan ) చిరంజీవి దగ్గర అడ్డంగా బుక్ అయితే అదే సమయంలో రానా కూడా తన తండ్రి దగ్గర దెబ్బలు తినేవాడట.దానికి ప్రధాన కారణం ఈ విషయం చిరంజీవికి తెలియడంతోనే అల్లు అరవింద్ స్వయంగా ఫోన్ చేసి రానా తండ్రికి చెప్పేవారట.దాంతో రానా ఇంటికి రావడంతోనే తండ్రితో దెబ్బలు తినేవారట.
ఈ కారణంతోనే అల్లు అరవింద్ నా జీవితంలో పెద్ద విలన్ అంటూ సరదాగా ఓ ఇంటర్వ్యూలో రానా దగ్గుబాటి చెప్పుకొచ్చారు.