Allu Arha : యానిమల్ సినిమా పాటకు స్టెప్పులు ఇరగదీసిన అల్లు అర్హ.. వీడియో వైరల్!

అల్లు అర్హ( Allu Arha ) పరిచయం అవసరం లేని పేరు అల్లు అర్జున్( Allu Arjun ) కుమార్తెగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే.అల్లు అర్హ ఇంత చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

 Allu Arjuns Daughter Arha Recreates Jamal Kudu Song Viral Video-TeluguStop.com

అదేవిధంగా ఈమె ఇప్పటికే బాలనటిగా ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అల్లు అర్హ ఇది వరకే గుణశేఖర్ దర్శకత్వంలో పెరిగిన శాకుంతలం( Shaakuntalam ) అనే సినిమాలో భరతుడి పాత్రలో నటించారు.

ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించారు.

ఈ విధంగా అల్లు అర్హ ఇంత చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానులను పోగు చేసుకున్నారు.ఇకపోతే అర్హ గురించి తన తల్లి స్నేహారెడ్డి( Sneha Reddy ) తరచు సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ముద్దు ముద్దు మాటలతో అల్లు అర్హత చెప్పే స్టోరీస్ అన్నీ కూడా అల్లు అర్జున్( Allu Arjun ) సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.

ఈ విధంగా తన మాటలతో అందరిని కట్టిపడేసినటువంటి ఈమె తాజాగా యానిమల్( Animal Movie ) సినిమాలోని జమల్ కుదు( Jamal Kudu Song ) అనే పాటకు డాన్స్ చేశారు.రణబీర్ కపూర్ నటించినటువంటి ఈ సినిమాలోని ఈ పాట ఎంతగా ఫేమస్ అయిందో మనకు తెలిసిందే.ఈ పాటకు ఎంతోమంది పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసారు.ఇలా ఎంతో ట్రెండ్ అయినటువంటి ఈ పాటకు తాజాగా అల్లు అర్హ డాన్స్ చేశారు.

సాంగ్‌లో మందు గ్లాస్‌ తలపై పెట్టుకుని బాబీ డియోల్( Bobby Deol ) స్టెప్పులేసిన సంగతి తెలిసిందే.అయితే అదే పాటకు అర్హ కూడా డ్యాన్స్ చేసింది.అయితే గ్లాస్‌తో కాకుండా తలపై ప్లేట్‌ పెట్టుకుని స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ తెగ మురిసి పోతున్నారు అల్లు అర్జున్ అభిమానులు.అల్లు అర్హ చాలా క్యూట్ గా డాన్స్ చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.అల్లు అర్హ పెద్దయిన తర్వాత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వస్తే మంచి స్టార్ హీరోయిన్ అవుతుంది అంటూ మరికొందరు ఈమెలో ఉన్నటువంటి టాలెంటును గుర్తించి కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube