ప్రస్తుతం టాలీవుడ్ లో స్టైలిష్ అల్లు అర్జున్( Allu Arjun ) హవ్వా ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.మన టాలీవుడ్ కి గర్వకారణంగా నిల్చిన హీరో ఆయన.
చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ కూడా, తన సొంత టాలెంట్ తో అంచలంచలుగా ఎదిగి నేడు మొట్టమొదటి నేషనల్ అవార్డు( National Award ) గెలుచుకున్న ఏకైక హీరో గా నిలిచాడు.ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ ఎలా ఉందంటే, ఒక మామూలు యావరేజి సినిమాని కూడా, తన నటనతో, ఎవ్వరూ మ్యాచ్ చెయ్యలేని స్వాగ్ తో సూపర్ హిట్ ని చేసేస్తాడు అనే పేరు వచ్చేసింది.
అందుకే పాన్ ఇండియన్ స్టార్ హీరో ఇమేజి వచ్చిన తర్వాత కూడా, ప్రాంతీయ బాషా దర్శకుడు అయినా త్రివిక్రమ్ తో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు.
పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిన తర్వాత ఎవ్వరూ కూడా త్రివిక్రమ్ తో( Trivikram ) సినిమా చెయ్యాలని అనుకోడు, కానీ అల్లు అర్జున్ ఆ రిస్క్ చేసాడు, కారణం తన స్టార్ స్టేటస్ మీద ఉన్న నమ్మకం వల్లే.
అయితే ప్రాజెక్ట్ ఓకే అయ్యే ముందు చాలానే జరిగింది అట.ముందుగా ఈ సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ( NTR ) చెయ్యాలని అనుకున్నారు.#RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమానే చెయ్యాలి.కానీ ఎందుకో ఎన్టీఆర్ కి ఫైనల్ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ నచ్చలేదు.
దాంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఎన్టీఆర్ దేవర చిత్రానికి( Devara ) షిఫ్ట్ అయ్యాడు.ఇప్పుడు ఆ కథతోనే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అట.సోషియో ఫాంటసీ నేపథ్యం లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది అట.మహాభారతం లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని పర్వం ని తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది.మన పురాణం మీద త్రివిక్రమ్ కి ఉన్నంత గ్రిప్ భారతదేశం లో ఏ డైరెక్టర్ కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఆయన పురాణం గురించి మాట్లాడితే అలా చూస్తూ వింటూ ఉండిపోతాం.
అలాంటి పట్టు ఉన్న డైరెక్టర్ తో సరైన సబ్జెక్టు తగిలినప్పుడు ఎన్టీఆర్ ఎందుకు ఒప్పుకోలేదు అనేది ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని బాధిస్తున్న విషయం.గతం లో ఇలాగే మహేష్ బాబు( Mahesh Babu ) పుష్ప సినిమాని కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేసాడు.ఆ తర్వాత అల్లు అర్జున్ ఆ సినిమాని చేసి ఎలాంటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడా మనమంతా చూసాం.త్వరలో రాబొయ్యే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ కూడా అలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందని అంటున్నారు.
ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవుతాడు.