తెలంగాణ ప్రభుత్వం మరోసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి రంగం సిద్దం చేసింది.ఈ మేరకు మూడో దశ, నాలుగో దశల్లో ఇళ్లను పంపిణీ చేయనున్నారు అధికారులు.
ఈనెల 27వ తేదీన హైదరాబాద్ కలెక్టరేట్ లో డ్రా తీయనున్న అధికారులు 10,500 ఇళ్లను లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం అందించనుంది.అనంతరం అదే రోజు నాలుగో విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డ్రా కార్యక్రమం జరగనుంది.
కాగా నాలుగో దశలోనూ 10,500 మందికి ఇళ్లను కేటాయించనుండగా అక్టోబర్ 2 నుంచి 5 వరకు నాలుగో దశ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరగనుందని అధికారులు తెలిపారు.దీంతో ప్రభుత్వ నిర్ణయంపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి పేదవానికి సొంతింటిని నిర్మించి ఇవ్వాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.