టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను దున్నేయాలని బన్నీ కసిగా చూస్తున్నాడు.
అయితే కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాతో దుమ్ములేపాలని దర్శకుడు సుకుమార్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను మరో లెవెల్‌లో తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు పుష్ప చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, అది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం.కాగా ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్‌తో ప్రేక్షకులను మరో వైబ్రేషన్‌లోకి తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.
ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో బన్నీ మార్క్ యాక్టింగ్ మునుపెన్నడూ చూడని విధంగా ఉండోబుతుందట.అయితే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తుండటంతో, తెలుగులో బన్నీ వాయిస్ సరే.మరి మిగతా భాషల్లో ఆ ఇంటెన్సిటీ రావాలంటే ఎవరు డబ్బింగ్ చేప్తారా అనే సందేహం ప్రస్తుతం అందరిలో నెలకొంది.
అయితే అందరికీ షాకిస్తూ పుష్ప రిలీజ్ అయ్యే అన్ని భాషల్లో కూడా బన్నీ తానే స్వయంగా డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నాడట.
ఆడా ఈడా తేడాలే అన్నట్లుగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెబితే ప్రతి సీన్‌కు పర్ఫెక్షన్ అనేది వస్తుందని బన్నీ భావిస్తున్నాడట.ఈ విషయంలో సుకుమార్ కూడా పచ్చజెండా ఊపేయడంతో ఇక ఈ సినిమా డబ్బింగ్‌కు సంబంధించిన పనులు కూడా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా, అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.








