ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ని పూర్తి చేయాలని చూస్తున్నాడు.2023 ఎండింగ్ కల్లా పుష్ప 2 ని రిలీజ్ చేసే ఆలోచనతో సుక్కు అండ్ టీం కష్టపడుతుంది.ఇక ఈ క్రమంలో అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల మీద కూడా ఫోకస్ పెడుతున్నాడట.పుష్ప 1 తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 ని ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు.
ఇక పుష్ప 2 తర్వాత ఊహించని విధంగా తనకు రేసుగ్గుర్రం లాంటి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడట అల్లు అర్జున్.
అల్లు అర్జున్ డెశిషన్ కి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
సైరా నర సింహా రెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా ఫలితాన్ని బట్టి సురేందర్ రెడ్డి అల్లు అర్జున్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట.
రేసు గుర్రం కాంబో అనగానే ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ మొదలైంది.అయితే సురేందర్ రెడ్డితో కూడా అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.