Allu Arjun Sneha Love Story : స్నేహ రెడ్డితో బన్నీ ప్రేమ విషయాన్ని ముందుగా ఆ హీరోయిన్ కి చెప్పారా.. ఎవరంటే?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Allu Arjun Reveals Details About Her Love Story With Sneha Reddy-TeluguStop.com

ఇక త్వరలోనే మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు.ఈయన త్వరలోనే పుష్ప 2( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ తన 13వ పెళ్లిరోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Allu Arjun, Alluarjun, Love Story, Samantha, Sneha Reddy-Movie

స్నేహ రెడ్డి( Sneha Reddy ) తో అల్లు అర్జున్ వివాహం 2011 వ సంవత్సరంలో ఎంతో ఘనంగా జరిగింది.ఈ క్రమంలోనే 13వ పెళ్లిరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన భార్య స్నేహారెడ్డి పై ప్రశంసలు కురిపిస్తూ అల్లు అర్జున్ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ స్నేహ లవ్ స్టోరీ( Allu Arjun Sneha Love Story ) గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అల్లు అర్జున్ తన లవ్ స్టోరీ ముందుగా ఒక హీరోయిన్ తో చెప్పారని తెలుస్తోంది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు సమంత.

Telugu Allu Arjun, Alluarjun, Love Story, Samantha, Sneha Reddy-Movie

సమంత వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి సామ్  జామ్ అనే కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొన్నప్పుడు తన ప్రేమ విషయాన్ని సమంత( Samantha ) కే ముందు చెప్పాననే విషయాన్ని రివీల్ చేశారు.నేను స్నేహారెడ్డిని ప్రేమిస్తున్నాననే విషయం కేవలం ఇద్దరికీ మాత్రమే తెలుసు అందులో ఒకరు సమంత.అసలు సమంతకు నేను ఎందుకు చెప్పానో ఇప్పటికే నాకు అర్థం కాలేదని బన్నీ తెలిపారు.

ఇలా అల్లు అర్జున్ చెప్పడంతో సమంత కూడా రియాక్ట్ అవుతూ ఆరోజు చాలా టెన్షన్ పడ్డారు స్నేహ ఒప్పుకుంటుందా లేదా అన్న టెన్షన్ లో మీరు ఒక చిన్న పిల్లాడిలా మారిపోయారు.ఇలా వీరి పెళ్లి రోజు సందర్భంగా ఈ ఓల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube