ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్..
ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది.గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుని అల్లు అర్జున్ స్థాయిని పాన్ ఇండియా వ్యాప్తంగా కూడా పెంచేసింది.
ఈ సినిమా దాదాపు 400 కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే.అల్లు అర్జున్ దమ్ము ఎంత ఉందో చూపించి పాన్ ఇండియా వ్యాప్తంగా తనని తాను నిరూపించు కున్నాడు.
ఇక ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
పుష్ప 2 సినిమాను పార్ట్ 1 కు మించి ఉండాలి అని ఉద్దేశంతో పది నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసి ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసారు.
ఈసారి మైత్రి పార్ట్ 2 కోసం 350 నుండి 400 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీ మొత్తం రెమ్యునరేషన్ గా అందుకుంటున్నట్టు టాక్.
అలాగే సక్సెస్ లో 30 శాతం వాటా కూడా అందుకోబోతున్నాడు అని తెలుస్తుంది.

మొత్తంగా అల్లు అర్జున్ ఈ సినిమాకు 130 కోట్లు అందుకునే అవకాశం ఉందట.పుష్ప 2 హిట్ అయితే ఇంత పెద్ద మొత్తం అల్లు అర్జున్ కు దక్కే అవకాశం ఉంది.మరి ఇదే కనుక జరిగితే అల్లు అర్జున్ టాలీవుడ్ లోనే అత్యధిక పారితోషికం అందుకున్న నెంబర్ 1 హీరోగా నిలవడం ఖాయం అంటున్నారు.
మరి చూడాలి పుష్ప 2 తో బన్నీ మరోసారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో.







