స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకుని ఇప్పుడు ఐకాన్ స్టార్ గా గ్లోబల్ వైడ్ గా వెలుగొందు తున్నాడు.
మరి ఈయన ఒక మెగా హీరోగా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు.ఎంత మెగా హీరో ( Mega Hero ) అనే ముద్ర వేసుకుని వచ్చిన కెరీర్ స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్స్ ఎదుర్కున్నాడు.
ఎన్నో సినీ కష్టాల తర్వాత ఈయన ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ ( stylish star )గా పేరు తెచ్చుకున్నాడు.ఇక గత కొన్ని రోజులుగా బన్నీ చేస్తున్న అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈయన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అల వైకుంఠపురములో, పుష్ప సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న అల్లు అర్జున్. పుష్ప ( Pushpa ) సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు పుష్ప 2 ను ఫ్యాన్స్ కోసం సిద్ధం చేస్తున్నాడు.

ప్రస్తుతం పాన్ ఇండియన్ వ్యాప్తంగా స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ ఈ రోజుతో తన 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నాడు.ఈయన ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఈ రోజుతో రెండు దశాబ్దాలు పూర్తి అయిన సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసాడు.తన 20 ఏళ్ల ప్రస్థానం గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు.
ఈయన పోస్ట్ చేస్తూ.

”ఈ రోజుతో నేను 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నాను.ఇన్నేళ్ళలో నాపై చూపించిన ప్రేమ, ఇంత స్టేజికి రావడానికి నా ఫ్యాన్స్ కు, నా మంచి కోరుకునే వారికీ నేనెప్పుడూ రుణపడి ఉంటానని.ఇండస్ట్రీలో ఎంతో మందితో వర్క్ చేయడం ఆనందంగా ఉందని” అల్లు అర్జున్ తన జర్నీ గురించి పోస్ట్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది.







