అల్లు అర్జున్‌ 'పుష్ప 2' తర్వాత చేయబోతున్న సినిమా అదేనా?

ఐకానిక్ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 సినిమా రూపొందబోతుంది.

ఆ సినిమా కు సంబంధించిన చిత్రీకరణ అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు.

ఎట్టకేలకు సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లుగా సుకుమార్‌ ప్రకటించాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా షూటింగ్‌ జులై రెండవ వారంలో జరుగబోతుంది.

కేవలం నాలుగు లేదా అయిదు నెలల షూటింగ్ తో సినిమాను పూర్తి చేస్తారట.వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా ను విడుదల చేస్తారని తెలుస్తోంది.

సుకుమార్‌ ఒక అద్బుతమైన కథ ను పుష్ప 2 కోసం రెడీ చేశారని మేకర్స్ టీమ్‌ నుండి సమాచారం అందుతోంది.హీరోయిన్ గా రష్మిక మందన్నా కంటిన్యూ అవ్వబోతుంది.

Advertisement

ఇదంతా బాగానే ఉంది కాని బన్నీ తదుపరి సినిమా ఏంటీ అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.లోకేష్ కనగరాజ్‌ మూవీ అంటూ కొందరు అన్నారు కాని అది కాదు అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

ఇక తాజాగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఐకాన్ అంటూ వార్తలు వచ్చాయి.అల్లు అర్జున్‌ ఐకాన్‌ సినిమా చేయడం కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

కాని ఇప్పటి వరకు ఆ సినిమా ను అధికారికంగా ప్రకటించలేదు.వకీల్‌ సాబ్ సినిమా తో సక్సెస్ ను దక్కించుకున్న వేణు శ్రీరామ్‌ ఖచ్చితంగా అల్లు అర్జున్ తో ఒక సినిమా ను చేస్తాడని అంతా భావించారు.

కాని అనూహ్యంగా పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్‌ చేయబోతున్న సినిమా ఒక తమిళ దర్శకుడితో ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.ఆ తమిళ దర్శకుడు ఎవరు అనే విషయం లో ఈ ఏడాది చివరి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందట.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

రెండు మూడు సంవత్సరాల క్రితమే వీరిద్దరి కాంబోకు సంబంధించిన చర్చలు జరిగాయి.కరోనా ఇతర కారణాల వల్ల సినిమా ఆలస్యం అయ్యింది.

Advertisement

ఎట్టకేలకు ఆయన కథ కు బన్నీ ఓకే చెప్పాడు అంటున్నారు.ఆయన ఎవరు.

కథ ఏంటీ అనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్‌ చేయాల్సిందే.

తాజా వార్తలు