Allu Arjun Varun Tej: వరుణ్ తేజ్ కోసం పుష్ప 2 కి బ్రేక్.. ఎంగేజ్మెంట్ కి రానున్న సెలబ్రిటీలు వీరే?

మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల ( Lavanya Tripathi ) గురించి మనందరికీ తెలిసిందే.

గత వారం రోజులుగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉన్నాయి.

అయితే గత కొంతకాలంగా ఈ జంటకు సంబంధించిన ప్రేమ పెళ్లి డేటింగ్ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు అంటూ ఇప్పటికే చాలాసార్లు అనేక రకాల వార్తలు వినిపించాయి.

కానీ ఇప్పటివరకు ఆ వార్తలపై అటు లావణ్య త్రిపాఠి కానీ ఇటు వరుణ్ తేజ్ కానీ అటు మెగా ఫ్యామిలీ కానీ స్పందించలేదు.అయితే మొత్తానికి ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ ఆన్ స్క్రీన్ జంట రియల్ లైఫ్ కపుల్ కాబోతున్నారు.

జూన్ 9న అనగా నేడు శుక్రవారం రోజున వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ కి అధికారిక ప్రకటన వచ్చేసింది.దీనితో మెగా ఫ్యామిలిలో పెళ్లి భాజాలు మోగనున్నాయి.ఇప్పటికే అందుకు సంబంధించిన సందడి కూడా మొదలైంది.

Advertisement

కాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల మధ్య అంతరిక్షం, మిస్టర్ సినిమాల సమయం నుంచి మొదలైంది.అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది.

కానీ ఎప్పుడూ వీరిద్దరూ మీడియా కంట పడలేదు.కలిసి వెకేషన్ కు వెళ్లడం కానీ ఒకరి గురించి ఒకరు ట్రీట్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు.

ఇది ఇలా ఉంటే ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు ఏ ఏ సెలబ్రిటీలు హాజరు కానున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు కేవలం వరుణ్,లావణ్య త్రిపాఠిల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.వరుణ్ తేజ్ కోసం పుష్ప 2( Pushpa 2 ) షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్( Allu Arjun ) షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి రాబోతున్నాడట.అలాగే రామ్ చరణ్, చిరంజీవి,పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా మెగా ఫ్యామిలీ నుంచి అందరూ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఎంగేజ్మెంట్ పూర్తయ్యాక వివాహ తేదీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే ఇప్పటికీ మెగా అభిమానుల్లో ఒక వర్గం వారు ఈ వార్తలు ఇంకా నమ్మక సఖ్యంగా లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు