Hansika Motwani : వద్దన్నా వినకుండా పబ్ లో బలవంతంగా ఆ పనిచేశారు.. అల్లు అర్జున్ గుట్టు రట్టు చేసిన హన్సిక..!!

1991 ముంబైలో జన్మించిన హన్సిక మోత్వాని ( Hansika Motwani ) చిన్నతనంలోనే సీరియల్స్,సినిమాల్లో చేసి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.

అలాగే ఈమె తండ్రి బిజినెస్ మాన్ తల్లి డెర్మటాలజిస్ట్.

వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు.హన్సిక తన తల్లి దగ్గరే పెరిగింది.

అలాగే హన్సిక చిన్నప్పుడు ఎన్నో సినిమాల్లో సీరియల్స్ బాల నటి గా మెప్పించి పూరి జగన్నాద్ దర్శకత్వంలో మొదటిసారిగా దేశముదురు సినిమాలో హీరోయిన్ గా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమైంది.ఇక హన్సిక మొదటి సినిమా హిట్ కొట్టడంతో అందరి దృష్టిని తనవైపు మళ్లించుకుంది.

అలాగే మస్కా ( Maska ) , కంత్రి, కందిరీగ,ఓ మై ఫ్రెండ్ వంటి తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించింది.

Advertisement

ఇక మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన హన్సిక ఆ తర్వాత స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది.అయితే హన్సిక దేశముదురు ( Deshamuduru ) సినిమాలో నటించే టైంలో కొన్ని ఆసక్తికర విషయాలు తన జీవితంలో జరిగాయని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో స్పష్టం చేసింది.అయితే తాజా ఇంటర్వ్యూలో కూడా అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ గురించి ఒక సీక్రెట్ ని బయట పెట్టింది.

హన్సిక మాట్లాడుతూ.దేశముదురు సినిమాలో నటించే టైంలో నా వయసు 15 సంవత్సరాలు మాత్రమే.

ఇక ఆ షూటింగ్ టైం లోనే నా బర్త్ డే అంటే 16వ సంవత్సరంలోకి అడుగు పెట్టాను.ఇక పూరి జగన్నాథ్ ( Puri jagannadh ) అల్లు అర్జున్ తో ఈరోజు నా బర్త్ డే సార్ అని చెప్పగానే వాళ్ళిద్దరూ నన్ను వెంటపెట్టుకొని మరీ పబ్ కి తీసుకెళ్లారు.ఐతే అప్పటివరకు నేను పబ్ మొహం కూడా చూడలేదు.

కానీ మొదటిసారి అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ వల్ల పబ్ కి వెళ్లాల్సి వచ్చింది.ఇక అక్కడికి వెళ్లాక నేను సైలెంట్ గా కూర్చుంటే బలవంతంగా పూరి జగన్నాథ్, అల్లు అర్జున్ ( Allu arjun ) లు నా నోరు తెరిచి మరీ వేడి వేడి పాలు నోట్లో పోశారు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

ఆ తర్వాత వేరే ఏవేవో నాతో తాగించారు.అంతేకాకుండా డాన్స్ కూడా చేయించారు.

Advertisement

ఇలా ఫస్ట్ టైం అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ ల వల్ల నేను పబ్ కి వెళ్లాను అంటూ హన్సిక దేశముదురు సినిమా టైంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది.ఇక హన్సిక గత సంవత్సరం డిసెంబర్ లో సోహైల్ కతూరియా తో పెళ్లి పీటలెక్కిన సంగతి మనకు తెలిసిందే.

తాజా వార్తలు