ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన దేశముదురు సినిమా ఇప్పటికి అల్లు ఫ్యాన్స్ మర్చిపోలేరు.అల్లు అర్జున్ దేశముదురు సినిమా తర్వాత మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు.
ఈ సినిమాలో హన్సిక మోత్వానీ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం అయ్యింది.ఈ సినిమాతో సూపర్ హిట్ సాధించి అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించు కున్నాడు.
ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించగా.చక్రి సంగీతం అందించాడు.బన్నీ కెరీర్ లోనే ఈ సినిమా మైల్ స్టోన్ గా మిగిలి పోయింది.అయితే గత కొన్నాళ్ల నుండి హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను వారి పుట్టిన రోజు నాడు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
మరి రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సమయంలో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమా కూడా రీరిలీజ్ కాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఈ టాక్ గత కొన్ని రోజుల నుండి వినిపిస్తున్న ఇప్పుడు గట్టిగ వినిపిస్తుంది.ఈ సినిమాను ఏప్రిల్ 7న భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ రెండు రోజుల్లోనే బన్నీ పుట్టిన రోజు కూడా ఉండడంతో ఈ సినిమా రీ రిలీజ్ గ్రాండ్ గా జరగనుంది.
మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.ఇక ఇదిలా ఉండగా ప్రెజెంట్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని పాన్ ఇండియా వ్యాప్తంగా తగ్గేదేలే అని నిరూపించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2 కోసం పని చేస్తున్నాడు.ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇంకా పార్ట్ 2 సెట్స్ మీదకు వెళ్ళలేదు.త్వరలోనే రెగ్యురల్ షూట్ స్టార్ట్ కానుంది.