కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు.తమకు అన్యాయం చేసిన జిల్లా కలెక్టర్ తో పాటు తమపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్ వలన తమ భూములను కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
తమ బాధను కలెక్టర్ కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు.







