అల్లు శిరీష్ హీరో గా నటించగా ఇటీవల విడుదలైన ఊర్వశివో రాక్షసివో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఈ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు, గత కొన్నాళ్లుగా అల్లు ఫ్యామిలీ లో సఖ్యత లేదు అంటూ వస్తున్న వార్త లకు చెక్ పెట్టే విధంగా హీరో అల్లు అర్జున్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భం గా అల్లు శిరీష్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.ముఖ్యం గా తన కెరియర్ ఈ స్థాయి లో ఉండడానికి కారణం తన మిత్రుడు బన్నీ వాసు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
నాన్న అల్లు అరవింద్ కి పాత్ర ఎంత ఉందో అంతకు మించి బన్నీ వాసు పాత్ర ఉంటుంది అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు బన్నీ వాసు పై తనకున్న అభిమానాన్ని చెప్పకనే చెబుతున్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బన్నీ వాసు మరియు అల్లు అర్జున్ మంచి స్నేహితులు.ఆ స్నేహం తోనే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ప్రముఖ స్థానం ను బన్నీ వాసు కి కల్పించడం జరిగింది.అల్లు అరవింద్ కూడా బన్నీ వాసు ని చాలా నమ్మాడు, తన యొక్క బాధ్యతలను పూర్తి గా బన్నీ వాసు కి అప్పగించాడు.
సినిమా ల నిర్మాణం విషయం లో బన్నీ వాసు కి ఉన్న ప్రతిభ ను గుర్తించిన అల్లు అరవింద్ గీతా 2 బ్యానర్ బాధ్యత లు మొత్తం ఆయనకి అప్పగించాడు.అల్లు అరవింద్ కంటే కూడా బన్నీ వాసు తన కెరీర్ కి ముఖ్యం అంటూ బన్నీ చేసిన వ్యాఖ్యలు బన్నీ వాసు స్థాయిని మరింతగా పెంచాయి అనడంలో సందేహం లేదు.
తన కెరీర్ లో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో బన్నీ వాసు ఒకడు అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యలు చేశాడంటే ఎంతటి ప్రాముఖ్యత ను బన్నీ వాసు కి అల్లు అర్జున్ ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.







