ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) క్రేజ్ పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా పెరిగింది అనే చెప్పాలి.ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ గా ”పుష్ప ది రూల్” చేస్తున్నాడు.
పాన్ ఇండియన్ దగ్గర భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ సినిమాల్లో పుష్ప టాప్ లో ఉంది అని చెప్పాలి.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు యావత్ ప్రపంచం ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తుంది.ఈ సినిమా 2024 ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కోసం డైరెక్టర్లు క్యూ లో నిలబడి నువ్వా నేనా అనే పోటీ పడుతున్నారు.ఇప్పటికే ఐకాన్ స్టార్ తన నెక్స్ట్ రెండు సినిమాలను అఫిషియల్ గా ప్రకటించాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో ఒక సినిమా, సుదీప్ వంగా( Sudeep Vanga )తో మరో సినిమాను ప్రకటించారు.ఈ రెండింటిలో ముందుగా ఏది అనేది క్లారిటీ లేదు.ముందు త్రివిక్రమ్ సినిమానే మొదలుపెట్టే అవకాశం ఉందని ఇన్ని రోజులు వార్తలు వచ్చిన కూడా ఇప్పుడు మళ్ళీ మరో వార్త వైరల్ అవుతుంది.అల్లు అర్జున్ కెరీర్ లో 22వ సినిమా ఏది అనే దానిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజా టాక్ ప్రకారం ఇటీవలే జవాన్ సినిమాతో వెయ్యి కోట్ల సినిమాను అందించిన అట్లీ కుమార్ ( Atlee Kumar )దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉండవచ్చని ఇప్పటికే ఒక స్టోరీ లైన్ కూడా అట్లీ వినిపించడంతో అది బన్నీకి బాగా నచ్చిందని పూర్తి స్క్రిప్ట్ నచ్చితే సినిమా చేద్దాం అని చెప్పారట.దీన్ని బట్టి అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అట్లీతో సినిమా ఉంటుంది అని ఆ తర్వాతనే త్రివిక్రమ్ సినిమా తెరకెక్కుతోందని టాక్.
ఈ రూమర్స్ లో నిజమెంతో తెలియాల్సి ఉంది.