అల్లు ప్రిన్సెస్ తో సరదాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్న అల్లు బ్రదర్స్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కుటుంబంలో అల్లు ఫ్యామిలీ ( Allu Family ) ఒకటి.

అల్లు అరవింద్ వారసులుగా అల్లు అర్జున్ (Allu Arjun) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక అల్లు శిరీష్ (Allu Shirish) కూడా ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం ఈయన సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి.ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ తనకు ఏమాత్రం సమయం దొరికిన తన పిల్లలతో కలిసి సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు.ఇలా తన పిల్లలతో అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను స్నేహారెడ్డి( Sneha Reddy ) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Advertisement

ఇందులో భాగంగా అల్లు ప్రిన్సెస్ అయినటువంటి అర్హ ( Arha ) తో అల్లు అర్జున్ అలాగే అల్లు శిరీష్ ఇద్దరు కూడా సరదాగా తనతో ఆటలాడుతూ ఉన్నటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇందులో భాగంగా అర్హ జెంగా ఆట ఆడుతూ ఉండగా ఒకవైపు అల్లు అర్జున్ మరొకవైపు అల్లు శిరీష్ తన వైపు అలా చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.ప్రస్తుతం ఈ ఫోటోను అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా లవ్ సింబల్ తో షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.ఈఫోటో చూసినట్టు వంటి అల్లు ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక అర్హ కూడా సోషల్ మీడియా వేదికగా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు