గత కొన్ని నెలల నుండి ప్రభాస్( Prabhas ) నటించిన ఆదిపురుష్ సినిమా( Adipurush Movie ) కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూశారు అని చెప్పాలి.మొత్తానికి ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా గురించి జనాలు రకరకాలుగా మాట్లాడారు.అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఓ రేంజ్ లో కబుర్లు చెప్పారు.
సీన్ కట్ చేస్తే ఈరోజు సినిమా రిజల్ట్ చూస్తే కాస్త అంతంత మాత్రమే అన్నట్లుగా అనిపించింది.
గతంలో ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ విడుదల చేసినప్పుడు బాగా ట్రోల్స్ ఎదురయ్యాయి.
మొత్తం కార్టూన్ లాగా ఉంది అంటూ చిన్నపిల్లలు మాత్రమే చూడవచ్చు అన్నట్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేసి బాగా వైరల్ చేశారు.ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ను జనాలు బాగా టార్గెట్ చేసి సోషల్ మీడియా ట్రౌలింగ్స్ తో ఆడుకున్నారు.
దీంతో దెబ్బకు సినీ బృందం స్పందించి తప్పులు జాగ్రత్తగా సరిచేసి మరోసారి ట్రైలర్ ను వదిలారు.
ఇక రెండోసారి వచ్చిన ట్రైలర్ పర్వాలేదు అన్నట్లుగా అనిపించింది.అంతేకాకుండా లుక్స్ కూడా బాగానే మార్చారు.దీంతో జనాలు ఈ సినిమాపై బానే అంచనాలు పెంచుకున్నారు.
తెలిసిన కథ అయినప్పటికీ కూడా ఈ సినిమా మంచి రికార్డు సొంతం చేసుకుంటుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ కలలు కన్నారు.కానీ ఈరోజు సినిమా విడుదల కావటంతో బాగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా ఆ సినిమాలో అల్లు అర్జున్( Allu Arjun ) వచ్చాడు అంటూ అంతేకాకుండా జీసస్ ( Jesus ) కూడా ఉన్నాడు అంటూ బాగా ట్రోల్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు ట్రోలర్స్.ఇంతకు అసలు విషయం ఏంటంటే ఆ సినిమాలో విఎఫ్ ఎక్స్ మైనస్ అవడంతో.ఆ సినిమా చూసిన వాళ్లంతా ఈ సినిమాలో ఇదే మైనస్ అని చెప్పుకుంటూ వస్తున్నారు.ఇక మరి కొంతమంది ఇందులో వానరు సైన్యంలో ఉన్న ఒక వ్యక్తి అచ్చం అల్లు అర్జున్ లాగా ఉన్నాడని.
బాగా ట్రోల్ చేయటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా ఫైర్ అవుతున్నారు.
అంతేకాకుండా అందులో రాఘవ పాత్రలో కనిపించిన ప్రభాస్ ని కూడా కొందరు బాగా టార్గెట్ చేసి ఆయన లుక్ పట్ల కూడా ట్రోల్ చేస్తున్నారు.అందులో ప్రభాస్ అచ్చం జీసస్ లాగా ఉన్నాడు అని అనడమే కాకుండా ఆ లుక్ లో ఉన్న ప్రభాస్ ను అచ్చం జీసస్ లాగా తయారుచేసి ఆది పురుష్ లో జీసస్ తో పాటు అల్లు అర్జున్ కూడా ఉన్నాడు అంటూ బాగా కామెంట్స్ చేస్తున్నారు.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ట్రోల్స్ పట్ల బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా నచ్చలేదని అన్నవారిని వారిని కొట్టినట్లు కూడా తెలిసింది.