గత కొన్నిరోజులుగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆదిపురుష్( Adipursh ) మూవీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటం గమనార్హం.
కొంతమంది ఈ సినిమాపై ట్రోల్స్ చేస్తున్నా మెజారిటీ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతోంది.అయితే ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ మాత్రం ఆమోదయోగ్యంగా లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనర్హం.
తైలం నీ బాబుది, కాలేది కూడా నీ బాబుదే అంటూ హనుమంతుని పాత్ర డైలాగ్స్ చెప్పడం ప్రేక్షకులకు నచ్చదు.అయితే ఓం రౌత్( Om Raut ) సినిమా స్టార్టింగ్ లోనే తన ఊహలకు అనుగుణంగా ఈ సినిమాను తీశానని చెబుతూ ఈ సినిమాపై విమర్శలు చేయాల్సి వస్తే తనపైనే చేయాలని పరోక్షంగా చెబుతున్నారు.
అయితే రామాయణం గురించి ఏ మాత్రం తెలియని వాళ్లకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమాలో త్రీడీ షాట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి.కొన్ని త్రీడీ షాట్స్ భయపెట్టే విధంగా ఉంటే మరికొన్ని త్రీడీ షాట్స్ మాత్రం ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆదిపురుష్ సినిమాలోని రావణుని పాత్ర విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) మాత్రం ఈ సినిమాకు మైనస్ అయ్యారనే చెప్పాలి.
ఆదిపురుష్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం భారీగానే ఉండనున్నాయని సమాచారం అందుతోంది.టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.ఓం రౌత్ రామాయణంతో ప్రయోగాలు చేయకుండా అవేంజర్స్ తరహా సినిమాలు చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ అభిమానులు మాత్రం ఆదిపురుష్ పై నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ల విషయంలో సీరియస్ అవుతున్నారు.కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం ఆదిపురుష్ వేరే లెవెల్ లో ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.