టాలీవుడ్ ఇండస్ట్రీలో గంగోత్రి సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన స్టైల్ తో, డ్యాన్స్ తో, నటనతో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు.నవ్యత ఉన్న కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నారు.2020లో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన అల వైకుంఠపురములో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ తాజాగా మరో అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేశారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో సినిమాలకు, ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను పంచుకుంటున్న అల్లు అర్జున్ ఫేస్ బుక్ ఫాలోవర్ల సంఖ్య 18 మిలియన్లకు చేరుకుంది.
చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఈ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు.ఇతర సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో అల్లు వారి అబ్బాయి తన హవా చూపిస్తున్నాడు.అల్లు అర్జున్ కు ట్విట్టర్ లో 5.2 మిలియన్ల ఫాలోవర్లు, ఇన్స్టాగ్రామ్ లో 8.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
అభిమానులు ప్రేమగా బన్నీ అని పిలుచుకునే స్టైలిష్ స్టార్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్నారు.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా చిత్తూరు యాసలో మాట్లాడే అమ్మాయి పాత్రలో నటిస్తోంది.రంగస్థలం తరువాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడిన ఈ సినిమాకు విలన్ ఫైనలైజ్ కావాల్సి ఉంది.అల్లు అర్జున్ కు ధీటుగా ఉండే విలన్ కోసం సుకుమార్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
సుకుమార్ విలన్ పాత్ర కోసం కొంతమందిని సంప్రదించినా ఎవరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.రెడ్ శాండిల్ స్మగ్లర్ గా పవర్ ఫుల్ పాత్రలో అల్లు అర్జున్ ఈ సినిమాలో కనిపించనున్నాడని తెలుస్తోంది.