జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే అనసూయ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘దర్జా‘.
సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి అనసూయ లుక్, ఫస్ట్ గ్లింప్ విడుదలయి సినిమాపై ఎంతో ఆసక్తిని కలిగించాలి.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మరోక అప్డేట్ విడుదల చేశారు.తాజాగా ఈ సినిమాలోని రెండవ పాటను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతుల మీదగా విడుదల చేశారు.
ఇక ఈ పాటను విడుదల చేసిన అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ.ఈ సినిమా నుంచి రెండవ పాటను విడుదల చేశాను,పాట ఎంతో అద్భుతంగా వచ్చింది.సినిమా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాననీ, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ. మా సినిమా దర్జాలోని రెండవ పాటను అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా లాంచ్ చేసి, ఆయన ఆశీస్సులు తెలిపినందుకు మా టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంటూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి వెల్లడించారు.ఇక మొదటి పాటను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేసిన సంగతి తెలిసిందే.







