Ram Charan Allu Arjun : చరణ్ బన్నీ మల్టీ స్టారర్ సినిమా కోసం టైటిల్ రిజిస్టర్ చేసిన అల్లు అరవింద్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో అల్లు అరవింద్( Allu Aravind ) ఒకరు.అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీ లోకి నిర్మాతగా అడుగుపెట్టినటువంటి ఇండస్ట్రీలో గీత ఆర్ట్స్ ప్రారంభించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

 Allu Aravind Registered The Title For Charan Bunny Multi Starrer Movie-TeluguStop.com

ఇలా నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన ఘనత గీత ఆర్ట్స్ బ్యానర్ కి ఉందని చెప్పాలి.

Telugu Allu Aravind, Allu Arjun, Charan Arjun, Geetha, Ram Charan, Ramcharan, To

ఇలా ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తనకు ఒక కోరిక ఉందని తెలిపారు.తనకి అల్లు అర్జున్( Allu Arjun ) , రామ్ చరణ్( Ram Charan ) కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలని ఉందనే విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే బన్నీ రామ్ చరణ్ కాంబినేషన్లో ఎప్పటికైనా సినిమా చేయాలన్న ఉద్దేశంతో అల్లుఅర్జున్ ఏకంగా ఒక టైటిల్ కూడా రిజిస్టర్ చేసి పెట్టారని ఈయన వెల్లడించారు.

Telugu Allu Aravind, Allu Arjun, Charan Arjun, Geetha, Ram Charan, Ramcharan, To

దాదాపు పది సంవత్సరాల క్రితం తాను వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఆ సినిమాకు చరణ్ అర్జున్( Charan Arjun ) అనే టైటిల్ పెట్టాలని అనుకున్నాను అందుకే ఈ టైటిల్ ని 10 సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేసి పెట్టానని ప్రతి సంవత్సరం దీనిని రెనివల్ చేస్తూ వస్తున్నానని అల్లు అరవింద్ తెలియజేశారు.ఇలా అల్లు అరవింద్ వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమాని గీత ఆర్ట్స్లో చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా రిజిస్టర్ కూడా చేసి పెట్టారని స్పష్టంగా అర్థం అవుతుంది.మరి అల్లు అరవింద్ కోరికను ఈ ఇద్దరు హీరోలు ఎప్పుడు తీరుస్తారో తెలియాల్సి ఉంది.

Telugu Allu Aravind, Allu Arjun, Charan Arjun, Geetha, Ram Charan, Ramcharan, To

ఒకప్పుడు టాలీవుడ్ హీరోలుగా గుర్తింపు పొందినటువంటి వీరిద్దరూ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు.ఇలా ఈ ఇద్దరు కూడా పాన్ ఇండియా హీరోలకు గుర్తింపు పొందడంతో సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.దీంతో వీరిద్దరూ కలిసి సినిమా చేసే అవకాశాలు కూడా లేకుండా చేశాయి.

బహుశా భవిష్యత్తులోనైనా వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలని ఉంది అంటూ ఎంతో మంది అభిమానులు కూడా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే మల్టీ స్టారర్ కోసం ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube