నాగ చైతన్య( Naga chaitanya )కెరీర్ జోష్ తో మొదలు అయ్యింది.మొదటి సినిమా తో నాగ చైతన్య ఫెయిల్యూర్ ను చవి చూశాడు.
ఆ తర్వాత ఏ మాయ చేశావే మరియు 100% లవ్( 100% Love Movie ) సినిమాలతో సక్సెస్ లను సొంతం చేసుకున్నాడు.గీతా ఆర్ట్స్ బ్యానర్( Geeta Arts Banner ) లో వచ్చిన 100% లవ్ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రికార్డు స్థాయి వసూళ్లు అప్పట్లోనే దక్కించుకుంది.నాగ చైతన్య కెరీర్ లో బెస్ట్ సినిమా గా.హిట్ సినిమా గా ఆ సినిమా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.

మళ్లీ ఇన్నాళ్లకు అల్లు అరవింద్( Allu Arvind ) సమర్పణ లో నాగ చైతన్య హీరోగా సినిమా ప్రారంభం కాబోతుంది.అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే వీరి కాంబోలో సినిమా గత ఏడాది లోనే ఉండాల్సి ఉంది.కానీ దర్శకుడు పరశురామ్ పదే పదే తన మాట మార్చడంతో సినిమా ఆలస్యం అయ్యింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎట్టకేలకు చందు మొండేటి దర్శకత్వం లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాణం లో అల్లు అరవింద్ సమర్పణలో ఒక సినిమా రాబోతుంది.

ఆ సినిమా కు సంబంధించిన చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి.నాగ చైతన్య హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమాను గీతా ఆర్ట్స్ వారు చాలా రోజుల క్రితమే రూపొందించాల్సి ఉంది.కానీ పరశురామ్ మొదట మహేష్ బాబు హీరోగా ఒక సినిమా అంటూ వెళ్లాడు.
సర్కారు వారి పాట సినిమా ను రూపొందించాడు.ఆ తర్వాత అయినా నాగ చైతన్య సినిమా ఉంటుందని భావించారు.
కానీ విజయ్ దేవరకొండ నుండి పిలుపు అందడంతో సినిమా ను మరోసారి పరశురామ్ క్యాన్సల్ చేసుకున్నాడు.దాంతో నాగ చైతన్య హీరోగా అల్లు అరవింద్ కొత్త సినిమా ను చందు మొండేటి( Chandu mondeti ) దర్శకత్వం లో చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా చుట్టు ఆసక్తికర చర్చ జరుగుతుంది.ఇదే ఏడాది లో సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.
మరి 100% లవ్ మాదిరిగా మ్యాజిక్ రిపీట్ అయ్యేంత సీన్ కొత్త సినిమా కు ఉంటుందా అనేది చూడాలి.







