ఇటీవల కాలంలో కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి పిల్లలు కూడా ఇంకా సినిమా ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇవ్వకముందే భారీగా పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు సృజనాత్మకతతో భిన్నమైన ఆలోచనలతో సోషల్ మీడియాలో నిలుస్తున్నారు.ముఖ్యంగా నేటి తరం పిల్లల ఆలోచనలు సృజనాత్మకతను అర్థం చేసుకోవడం ఒక్కోసారి కష్టంగా ఉంటున్నా లోతైన అర్థం ఉంటుందని అన్నారు సినీ నిర్మాత అల్లు అరవింద్.
టాలీవుడ్ దర్శకుడు మారుతి కుమార్తె హియా దాసరి( Hiya Dasari ) గీసిన చిత్రాల ప్రదర్శన తాజాగా శనివారం బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్‌లో నిర్వహించగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అరవింద్ హాజరయ్యారు.

హియా గీసిన చిత్రాలను వీక్షించిన అరవింద్( Allu aravind ) అనంతరం ఆమె టాలెంట్‌ను ఆయన అభినందించారు.ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హియా దాసరికామిక్, స్టోరీస్‌లోని జోకర్, బ్యాట్‌మెన్, తదితర క్యారెక్టర్లను ఇతివృత్తంగా చేసుకొని బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో ది నోయిర్ రెండిజ్‌వోజ్ పేరుతో ఆర్ట్ షో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా హియా మాట్లాడుతూ.
నేను 71 చిత్రాలు గీశాను.ఇందుకోసం నాకు 8 నెలల సమయం పట్టింది.
నా ప్రతిభ వెనుకాల నా తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు.భవిష్యత్‌లో మరిన్ని అంశాలపై నా చిత్రాలు ఉంటాయి అని హియా చెప్పుకొచ్చారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ బన్నీ వాసు( Bunny Vasu ), టీజీ విశ్వప్రసాద్, ప్రొడ్యూసర్ రవి శంకర్, నాగ వంశీ, హీరో ఆనంద్ దేవరకొండ, సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్, నిర్మాత ఎస్‌కేఎన్, హీరోయిన్ వైష్ణవి, విరాజ్ తదితరులు పాల్గొని హియా దాసరి గీసిన చిత్రాలను వీక్షించారు.మిగతా సెలబ్రిటీలు కూడా మారుతి కూతురు వేసిన చిత్రాలను మెచ్చుకోవడంతో పాటు ఆమెపై ప్రశంసలు కురిపించారు.అంతేకాకుండా డైరెక్టర్ మారుతి కూతురి టాలెంట్ చూసి ఫిదా అవుతున్నారు.







