తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా టాలెంట్ విజన్ ఉన్న నిర్మాతలలో అల్లు అరవింద్ కూడా ఒకరు అని చెబుతూ ఉంటారు.తండ్రి దారిలో నటన వైపు వెళ్లకుండా సరికొత్తగా నిర్మాణాన్ని ఎంచుకుని ఇక సూపర్ సక్సెస్ అయి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ నిర్మాతగా కొనసాగుతున్నారు అల్లు అరవింద్.
డిఫరెంట్ స్టైల్ లో ఉన్న కథలను ఎంచుకుంటూ ఒక విజన్ తో సినిమాలను తీసే వారిని ప్రోత్సహిస్తూ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు ఆయన.ఇక మెగా ఫ్యామిలీ హీరోల కెరీర్ సెట్ చేయడం లోనే కాదు ఇక తన బిజినెస్ పెంచుకోవడంలో కూడా అల్లు అర్జున్ ఎంతో కీలకంగా వ్యవహరించారు అని చెప్పాలి.
ఎవరూ ఊహించని విధంగా తెలుగు ఓటిటి ఆహను బరిలోకి దింపి తక్కువ సమయం లోనే నెంబర్ వన్ స్థానం లోకి తీసుకు వచ్చాడు.ఇక ఇప్పుడు కూడా తన విజన్ తో దూసుకుపోతున్నారు అల్లు అరవింద్.
నిన్నటి వరకు బడా హీరోలతో సినిమాలు చేసిన అల్లు అరవింద్ ఇక ఇప్పుడు మాత్రం చిన్న హీరోలతో సినిమాలు నిర్మించి భారీ మొత్తంలో లాభాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు.ఇటీవల వరుణ్ తేజ్ గని, హిందీ జెర్సీ లు అటు బాగా నష్టాలు తీసుకువచ్చి పెట్టాయి.
దీంతో పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నాడు.

చిన్న హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు సూపర్ హిట్ తర్వాత ఇక ఇప్పుడు ఈ హీరోతో ఒక సినిమాని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.ఇక మరోవైపు అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమాతో హిట్ కొట్టిన హీరో విశ్వక్సేన్ తో ఒక భారీ డీల్ సెట్ చేసుకున్నాడట అరవింద్.ఇక ఎవరికీ తెలియకుండా ఎంతో సీక్రెట్ గా ఈ డీల్ జరిగింది అని తెలుస్తూ ఉంది.
ఇలా చిన్న హీరోలతో సినిమాలు తీసి పెద్ద లాభాలు సాధించి ఒకవైపు హీరోలకు మంచి ఆఫర్ ఇచ్చాడు అన్న మంచి పేరు సొంతం చేసుకోవడమే కాదు.మరోవైపు లాభాలు కూడా సొంతం చేసుకోవాలని ప్లాన్ వేసాడట అల్లు అరవింద్.