ఖమ్మం మేత్రాసనంపై కొందరు కావాలనే కుట్రతో మేత్రాసనం సెక్రెటరీ, ప్రోర్కోరేటర్ ఫాదర్ పై దాడి చేయడాన్ని డైసిస్ ఖమ్మం సొసైటీ తరుపున పూర్వ విద్యార్థులు, అభ్యుదయ దళిత నాయకులు కాసిమల్ల నాగేశ్వరావు తీవ్రంగా ఖండించారు.సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాగేశ్వరావు మాట్లాడుతూ.
బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతితో పాటు ఉచితంగా విద్య, వైద్యం అందించేందుకు ఖమ్మం మేత్రాసనం ఏర్పాటు చేయబడినది కొనియాడారు.కానీ నేడు కొంతమంది కుట్రతో అనివార్యంగా మేత్రాసనంలో సేవచేసే ఫాదర్ పై దాడిని ఖండిస్తున్నామన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బడుగు బలహీన వర్గాల జాతుల అభివృద్దే ద్యేయంగా ఖమ్మం డైసిస్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.వీరి సేవల ద్వారా ఎంతోమంది విద్యావంతులను ఈ సమాజానికి, దేశానికి అందించింది ఈ ఖమ్మం మేత్రాసనం అన్నారు.
ఈ మేత్రాసనంలో 150మంది సేవకులు నిర్విరామంగా పనిచేస్తున్నారన్నారు.ఖమ్మం మేత్రాసనంకు 120సంవత్సరాల చరిత్ర ఉందన్నారు.
ఎంతోమంది పేద స్త్రీలకు కుట్టు మిషన్లు, పేద రైతులకు పొలాల్లో నీటి పంపులు, బోర్లు, త్రాగునీటి సమస్య ఉన్న అనేక గ్రామాల్లో నీటి బోర్లు లాంటి ఎన్నో సేవలు మేత్రాసనం చేసిందని కొనియాడారు.కొందరు స్వార్ధ బుద్ధితో ఈ సంస్థపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో సొసైటీలు నడుస్తాయని ఈ సొసైటీ కూడా రిజిస్టర్ చేయబడి పారదర్శకంగా నడుస్తుందన్నారు దీనిపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై,ఫాదర్ పై దాడి చేసిన వారిపై జిల్లా అధికారులు విచారించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ విలేకరుల సమావేశంలో మహేందర్ నాద్, చల్లగొండ క్రిష్ణయ్య, బల్లెం అంజయ్య, ముత్తమాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







