అల్లు అరవింద్ వల్లే చిరంజీవి సక్సెస్.. చంద్రమోహన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆయన కష్టం ఎంతో ఉందనే సంగతి తెలిసిందే.స్టార్ స్టేటస్ ను అందుకోవడం కోసం చిరంజీవి నిద్రలేని రాత్రులు గడిపిన సందర్భాలు సైతం ఉన్నాయి.

 Allu Aravind Is The Reason For Chiranjeevi Success Details Here Goes Viral , All-TeluguStop.com

కథల ఎంపికలో మిగతా హీరోలకు భిన్నంగా వ్యవహరించడం, ప్రయోగాత్మక కథలకు అంగీకరించడం, అద్భుతమైన డైలాగ్ డెలివరీ, కళ్లు చెదిరేలా డ్యాన్స్ స్టెప్పులు వేయడం చిరంజీవి సక్సెస్ కు కారణమని చాలామంది చెబుతున్నారు.

అయితే తాజాగా చంద్రమోహన్ చిరంజీవి సక్సెస్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి ఈ స్థాయికి చేరుకోలేరని కొంతమందిలో భావన ఉంది.అయితే చంద్రమోహన్ కూడా తాజాగా ఇదే తరహా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తనకు ఎవరి సపోర్ట్ లేదని అందుకే స్టార్ స్టేటస్ రాలేదని ఆయన అన్నారు.

చిరంజీవికి అల్లు అరవింద్ సపోర్ట్ ఉన్న విధంగా తనకు కూడా సపోర్ట్ ఉండి ఉంటే బాగుండేదని చంద్రమోహన్ అభిప్రాయపడ్డారు.

కృష్ణుడు లేకపోతే అర్జునుడు వృథా అని చెబుతూ అల్లు అరవింద్ ను కృష్ణునితో చిరంజీవిని అర్జునునితో పోల్చడం గమనార్హం.అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవికి కెరీర్ లేదనే విధంగా కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Allu Arvind, Chandramohan, Chiranjeevi, Chirenjeevi, Tollywood-Movie

చిరంజీవి ఎలాంటి వేషాలు వేయాలో ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలో ఏ బ్యానర్లలో నటించాలి అనే విషయాలను అల్లు అరవింద్ చూసుకున్నారని ఈ విధంగా చిరంజీవి సక్సెస్ కు అల్లు అరవింద్ కారణమయ్యారని చంద్రమోహన్ అభిప్రాయపడ్డారు.ఆయన కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వైరల్ అవుతున్న కామెంట్ల గురించి చిరంజీవి, అల్లు అరవింద్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.చిరంజీవి ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube