టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అరవింద్ (Allu Aravind)ఇటీవల తండేల్ సినిమా(Thandel) ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రామ్ చరణ్(Ram Charan) సినిమా గురించి పరోక్షంగా కామెంట్లు చేస్తూ ఆయన సినిమాని అవమానించారు అంటూ మెగా అభిమానులు అల్లు అరవింద్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.ఈ వేడుకలో భాగంగా దిల్ రాజు(Dil Raju) ముఖ్య అతిథిగా రావడంతో ఈయన ఒక వారంలో ఒక సినిమాని నేలకు తీసుకెళ్లారు మరో సినిమాని ఆకాశానికి తీసుకెళ్లారు అంటూ మాట్లాడటంతో మెగా అభిమానులు కచ్చితంగా చరణ్ సినిమాని ఉద్దేశించేయన కామెంట్లు చేశారంటే విమర్శలు కురిపించారు.

తాజాగా ఈ విమర్శలపై అల్లు అరవింద్ స్పందించారు.తండేల్(Tandel) సినిమా పైరసీ జరుగుతుంది దాన్ని అరికట్టాలంటూ ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్(Allu Aravind) కు ఇదే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు అల్లు అరవింద్ సమాధానం చెబుతూ.నేను ఆరోజు మాట్లాడిన ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు.అయితే నేను చరణ్ గురించి మాట్లాడారని మెగా అభిమానులు నాపై చాలా ట్రోల్స్ చేశారు.నిజానికి ఆరోజు దిల్ రాజు కష్టాలను ప్రస్తావిస్తూ నేను మాట్లాడాను, అది యాదృచ్ఛికంగా వచ్చిన విషయమే తప్ప నేను కావాలని ప్రస్తావించింది.

చరణ్ గురించి నేనెందుకు అలా మాట్లాడతాను నాకు చరణ్ ఉన్నటువంటి ఏకైక మేనల్లుడు తనుకు నేను ఉన్నటువంటి ఏకైక మేనమామను.మా ఇద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది.నాకు చరణ్ అల్లుడు అయినప్పటికీ కొడుకుతో సమానమే అంటూ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి కూడా అల్లు అరవింద్ ఈ సందర్భంగా బయటపెట్టారు.అయితే నేను ఆరోజు ఉద్దేశపూర్వకంగా మాత్రం మాట్లాడలేదని , ఇక ఈ విషయాన్ని ఇంతటితోనే ఆపేయండి ఇకపై మాట్లాడితే మరికొన్ని వివాదాలు కూడా జరుగుతాయి అంటూ అల్లు అరవింద్ ఈ వివాదానికి చెక్ పెట్టేశారు.







