అల్లు అరవింద్ తో చిందులేసిన అనుపమ.. వైరల్ వీడియో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందాలతో మైమరిపించిన  కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అందంతోనే కాకుండా నటనతో కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

 Allu Aravind Dance With Anupama 18 Pages Movie Success Party,allu Aravind,anupam-TeluguStop.com

ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది అనుపమ.తర్వాత ‘అఆ’ సినిమాలో కూడా మంచి పేరు సంపాదించుకుంది.

అలా ఆ తర్వాత  ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అతి తక్కువ సమయంలో ఒక హోదా సొంతం చేసుకుంది అనుపమ.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో.నిత్యం ఏదో ఒక ఫోటోను, ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేస్తుంది.ఇక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.

నిజానికి అనుపమ అంటే పడి చచ్చే కుర్రాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు.ఎంతలా అంటే తను ఏదైనా ఫోటో షేర్ చేసుకుంటే చాలు వెంటనే ఆ ఫోటోలను ప్రొఫైల్ గా మార్చుకుంటారు.

ఇక ఈ బ్యూటీని ముద్దుగా ఉప్మా అని పిలుచుకుంటారు తన అభిమానులు.మామూలుగా అనుపమ చూడటానికి చాలా క్యూట్ గా ఉంటుంది.

ఇక ఈ బ్యూటీ ఈ మధ్య వరుస సక్సెస్ లతో బాగా పరుగులు తీస్తుంది.

టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.తను నటించిన 18 పేజెస్ సినిమా కూడా తాజాగా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.

నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించారు.అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు, సుకుమార్ ఈ సినిమాను నిర్మించారు.

ఇక ఈ సినిమా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.

దీంతో ఈ సినిమా సక్సెస్ సందర్భంగా సినీ బృందం ఎంజాయ్ చేస్తూ కనిపించారు.తాజాగా దానికి సంబంధించిన వీడియోను అనుపమ తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది.ఇక ఆ వీడియోలో నిఖిల్, అనుపమ చాలా ఎంజాయ్ లో కనిపించారు.

అంతే కాకుండా అనుపమ అల్లు అరవింద్ తో కలిసి చిందులేస్తు కనిపించింది.ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ప్రస్తుతం థియేటర్లలో 18 పేజెస్ జోరుగా కలెక్షన్లను సంపాదించుకుంటుంది.ఇక అనుపమ మరో సినిమాలో కూడా అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube