ఆళ్లగడ్డ ' బరిలో మంచువారి అబ్బాయ్ ..? 

మరో యంగ్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది.ప్రముఖ నటుడు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ ( Manchu Manoj )టిడిపి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారమే దీనికి కారణం.

 Allagadda' Manchuvari's Boy In The Ring , Manchu Manoj, Jagan, Ysrcp, Ap Govern-TeluguStop.com

నిన్ననే టిడిపి అధినేత చంద్రబాబుతో మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి భేటీ కావడంతో, వీరి భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.టిడిపిలో చేరేందుకు మంచు మనోజ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, ఆ విషయం పైన చర్చించేందుకు చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతుంది.

Telugu Ap, Av Subba, Bhumamounika, Chandrababu, Jagan, Manchu Manoj, Manchu Vish

నిన్ననే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు( Chandrababu ) నివాసంకు వెళ్లిన మనోజ్ , మౌనిక రెడ్డిలు( Mounika Reddy ) దాదాపు నాలుగు నిమిషాల పాటు చంద్రబాబుతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రాజకీయ , కుటుంబ విషయాలపై చర్చ జరిగిందట.ఈ చర్చ అనంతరం మీడియా తో మనోజ్ మాట్లాడారు.మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత ఇప్పటివరకు చంద్రబాబును కలవలేదని , ఆయనను కలిసి ఆశీర్వాదాలు తీసుకునేందుకు కలిశానని చెబుతున్నారు .చంద్రబాబుకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పగానే వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారని మనోజ్ వివరించారు.కుమారుడు పుట్టినరోజు కావడంతో కుటుంబంతో సహా కలిసి చంద్రబాబు ఆశీర్వాదాన్ని తీసుకున్నానని,  చంద్రబాబుతో భేటీ కావడం సంతోషంగా ఉందని మనోజ్ ప్రకటించారు.

అయితే మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న భూమ మౌనిక రెడ్డి కుటుంబం టిడిపిలోనే ఉంది.

Telugu Ap, Av Subba, Bhumamounika, Chandrababu, Jagan, Manchu Manoj, Manchu Vish

మౌనిక రెడ్డి సోదరి అఖిలప్రియ( Akhila priya ) టిడిపిలో మంత్రిగాను పనిచేశారు.2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ నుంచి ఆమె పోటీ చేసి ఓటమి చెందరు.అయితే 2024 ఎన్నికల్లో మంచు మనోజ్ ఆళ్లగడ్డ అసెంబ్లీ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారని  , ఆ విషయం పైనే చర్చించేందుకు చంద్రబాబుతో భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే భూమ అఖిలప్రియ పై నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొనడం,  టిడిపికే చెందిన సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి ( Subbareddy )తో భూమా అఖిలప్రియకు తీవ్రస్థాయిలో విభేదాలు ఉండడంతో,  అఖిల ప్రియను తప్పించి ఆస్థానం నుంచి మంచు మనోజ్ ను పోటీకి దింపితే ఫలితం ఉంటుందని చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారని,  ఈ వ్యవహారాలపైనే నిన్న చంద్రబాబు మనోజ్ మధ్య చర్చ జరిగిందని ప్రచారం జరుగుతుంది.మనోజ్ లేకపోతే మౌనిక ఈ ఇద్దరిలో ఒకరు పోటీ చేయడం ఖాయం అనే ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube