నీ వెంట ఉన్నవారంతా నీ వాళ్లు కాదు ! పొంగులేటి కి సండ్ర సెటైర్లు

మాజీ ఎంపీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) వ్యవహారం గత కొద్ది రోజులుగావ్ తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయంశంగా మారిన సంగతి తెలిసిందే.పదే పదే పార్టీ పై విమర్శలు చేస్తున్నారనే కారణంతో ఆయనపై బీ ఆర్ ఎస్( B.

 All Those Who Are With You Are Not Yours! Ponguleti Sandra Satires, Ponguleti S-TeluguStop.com

R.S ) అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది .దీంతో ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది.ఇదిలా ఉంటే తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శలు చేశారు.

ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  వీరయ్య ప్రారంభించారు .ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేసుకొని విమర్శలు చేశారు.

Telugu Congress, Khammam Mp, Sandravenkata, Telangana-Politics

విమర్శలే ధ్యేయంగా,  ఏ పనులు చేయకుండా అహంకారపూరితంగా మాట్లాడే వారికి ఓట్లు వేస్తారా మీరే తెలుసుకోవాలని ప్రజలను ఉద్దేశించి వీరయ్య అన్నారు.ఇటువంటి నాయకుడు ప్రజా స్వామ్యానికి అవసరమా అని ప్రశ్నించారు.పొంగులేటి వెంట తిరిగే వారందరూ ఉదయం పొంగులేటితోను,  సాయంత్రం వేరే నాయకుడుతో కలిసి తిరుగుతున్నారని , అయినా పొంగులేటికి ఆ విషయం తెలియట్లేదు అని అన్నారు.నీ వెంట ఉన్నవారు అంతా నీ వాళ్లు కాదు అంటూ విమర్శలు చేశారు.

పార్టీ కోసం పని చేసే వారిని సమర్థించాలి కానీ , వ్యక్తి ప్రయోజనం కోసం పని చేసే వారిని సమర్థించకూడదని పొంగులేటి అన్నారు.అటువంటి నాయకుడితో పార్టీలు నాశనం అవుతాయని అన్నారు .

Telugu Congress, Khammam Mp, Sandravenkata, Telangana-Politics

 తెలంగాణలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ప్రభుత్వాన్ని అసెంబ్లీ గేటు తాకనివ్వను అంటున్నావు , నువ్వు ప్రజలకు చేసిన మంచి పనులు ఏమిటి అంటూ వీరయ్య పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు.  ప్రజలకు అన్ని మంచి పనులు చేసాం కాబట్టే ప్రజల విశ్వాసం పొందుతున్నామని,  ప్రజల విశ్వాసం తమకే ఉందని వీరయ్య అన్నారు.  ఇటువంటి చౌకబారు విమర్శలు చేసేవారిని ప్రజలు నమ్మరని , పొంగులేటి రాజకీయాల్లోకి రాకముందు నీ పరిస్థితి ఏమిటో తెలుసునని,  ఇప్పుడు పొంగులేటి చరిత్ర ప్రజలకు తెలుసునని అన్నారు.కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నిన్ను ప్రజలు గమనిస్తున్నారని,  జిల్లాలో నీవు ఏమి అభివృద్ధి చేశావు ? నీకు ఎలా ఓట్లు వేస్తారు ? నీకు రాజకీయ విధానం తెలియదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube