టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోలంతా ఒక ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.కుర్ర హీరోల నుండి పాన్ ఇండియన్ హీరోల వరకు అంతా కూడా తమ సినిమాలకు ప్రాంచైజీలను చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
మరి మన టాలీవుడ్ లో ఒకే ఒక్కడు మాత్రం ఈ ట్రెండ్ కు ఇంకా దూరంగా ఉంటున్నాడు.ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో సీక్వెల్స్ ఏమీ చేయడం లేదు.

మరి ఆ హీరో ఎవరంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ). ఈయన ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్నాడు.మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు బాహుబలి సిరీస్( Baahubali ) రెండు భాగాలుగా వచ్చి సూపర్ హిట్ అయ్యి ఎన్నో సినిమాలకు స్ఫూర్తిని ఇచ్చింది.ఈ సినిమానే మన టాలీవుడ్ సినిమాల రూపురేఖలు మార్చేసింది.
అప్పటి వరకు 100 కోట్లు పెట్టాలంటే భయపడే నిర్మాతలు ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యిన తర్వాత ఒక్కో సినిమాకే 500 కోట్లు అయినా పెట్టేవిధంగా మారిపోయింది.ఇక బాహుబలి సిరీస్ తర్వాత కేజిఎఫ్( KGF ) కూడా రెండు భాగాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇలా ఈ సినిమాలు ఇచ్చిన ట్రెండ్ ను మిగిలిన మేకర్స్ అంతా ఫాలో అవుతూ రెండు పార్టులుగా తీసే ఆస్కారం ఉంటే తప్పకుండ తీస్తున్నారు.

మరి మన టాలీవుడ్ లో మొదటి పార్ట్ షూటింగ్ జరుగుతుండగానే సెకండ్ పార్ట్ ఉందని అనౌన్స్ చేసేస్తున్నారు.అలా చెప్పిన సినిమాల్లో ప్రభాస్ సలార్( Salaar ), కల్కి సినిమాలు రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు.తాజాగా కొరటాల కూడా ఎన్టీఆర్ దేవర సినిమా( Devara )ను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్టు తెలిపాడు.
పుష్ప ఆల్రెడీ అదే పనిలో ఉంది.
పవన్ ఓజి కూడా రెండు భాగాలుగానే వస్తుందని టాక్.
అలాగే బాలయ్య అఖండ కూడా రెండవ పార్ట్ కు సన్నద్ధం అవుతుంది.ఇష్మార్ట్ శంకర్ కు పార్ట్ 2 గా డబుల్ ఇష్మార్ట్ తెరకెక్కుతుంది.
మహేష్ జక్కన్న మూవీ కూడా రెండు భాగాలుగానే వచ్చే అవకాశం ఉంది.ఇలా టైర్ 2 హీరోల నుండి స్టార్ హీరోల వరకు రెండు భాగాలుగా తమ సినిమాలను అనౌన్స్ చేస్తున్న ఈ ట్రెండ్ కు రామ్ చరణ్ ఒక్కరే దూరంగా ఉంటున్నాడు.
మరి ముందు ముందు ఏమైనా ఆలోచనలో ఉందో లేదో చూడాలి.







