ఏపీలోని వ్యవస్థలన్నీ కుళ్లిపోయాయని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు.పోలీస్ అధికారులు సమర్థవంతంగా ఉంటే ఈ ఖర్మ పట్టేది కాదన్నారు.
ముఖ్యమంత్రి జగన్ కి కాపలాకాయడమే సరిపోతుందని తెలిపారు.గుంటుపల్లి, గొల్లపూడి, భవానిపురం, రాయనపాడులో దొంగలున్నారన్న దేవినేని మహిళలు ఇళ్లలో బంగారం పెట్టుకునే పరిస్థితి లేకుండా ఉందని విమర్శించారు.
దొంగలను పట్టుకోకుండా మహిళలను విచారణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.పోలీస్ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి చర్యలు తీసుకుంటామని తెలిపారు.







