కొంతకాలంగా ఎన్నో వైరస్లు రకరకాలుగా మనుషులను ఇబ్బందులు పెడుతున్నాయి.ఎవరికి ఎప్పుడు ఏ రోగం వస్తుందో ఎవరికీ కూడా తెలియదు.
అయితే భూమ్మీద భగవంతుని స్వరూపంగా భావించే మన వైద్యులకు కూడా అస్సలు తెలియదు.అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా మంచి ఆహారాన్ని తినాలని, వ్యాయామం చేయాలని దీనితో ఆరోగ్యం బాగుంటుందని చెబుతూ ఉంటారు.
అయితే కొంతమంది పిల్లలు పుట్టినప్పటినుంచి వ్యాధుల బారిన పడతారు.ఇక జీవితాంతం వారు తమ ప్రాణాల కోసం నిరంతరం వైద్యం తీసుకుంటూ పోరాడుతూ ఉంటారు.అయితే పుట్టినప్పటి నుంచి ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్న ఓ అమ్మాయి గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.అయితే న్యూజిలాండ్ కు చెందిన ఓ అమ్మాయి తన పేరు జెస్సికా మన్నింగ్.
అయితే ఈమె పుట్టడమే ఓ వింత వ్యాధితో జన్మించింది.అయితే ఆమె గుండెను ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి అల్మారా లో ఉంచాలి.
అయితే ప్రస్తుతం ఆమె యంత్రాల సాయంతోనే జీవితం సాగిస్తోంది.ఇక యంత్రాలు ఆగిపోయిన రోజు ఆ అమ్మాయి ఊపిరి కూడా ఆగిపోతుంది.అయితే మిర్రర్ పత్రిక నివేదిక ప్రకారం జెస్సికా కు పుట్టినప్పటినుంచి గుండె వ్యాధి ఉంది.ఆమె గుండె సగం మాత్రమే అభివృద్ధి చెందింది.
ఆమె గుండెలో కేవలం రంధ్రాలు, లీక్ వాల్వ్స్ మాత్రమే ఉన్నాయి.అయితే తన మూడేళ్ల వయసులో ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది.

అప్పటినుంచి వైద్యులు ఆమెపై ఎన్నో చికిత్సలు చేయడం ద్వారా ఆమె 28 సంవత్సరాల వరకు ఇలా బ్రతికి ఉంది.అయితే అసలు విషయం ఏంటంటే ఆమెకు ఇప్పటికే 200 కంటే ఎక్కువగా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎన్నో శస్త్ర చికిత్సలు జరిగాయి.
అయితే ఇందులో అయిదు సార్లు ఓపెన్ హార్ట్ సర్జరీలు జరగ్గా రెండుసార్లు పేస్ మేకర్ సర్జరీ, ఒకసారి ఊపిరితిత్తుల శాస్త్ర చికిత్సలు జరిగాయి.అలాగే గుండె, కాలేయం మార్పిడి కూడా చేయించారు.
ప్రస్తుతం ఆమె యంత్రాల సాయంతో జీవిస్తుంది.తన బెడ్రూమ్ లో తన గుండెని భద్రంగా ఓ అల్మారాలో ఉంచింది.